హారర్ థ్రిల‌ర్‌గా కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీ..!

నందమూరి కుటుంబం నుంచి హీరోలుగా ఎంతోమంది అడుగుపెట్టారు. వారిలో కేవలం బాలయ్య, ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తాజాగా బింబిసారా హిట్ తో పాపులారిటీ దక్కించుకొని కళ్యాణ్ రామ్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ఆచితూచి సినిమాల్లో ఎంచుకుంటున్నాడు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు నటిస్తున్నాడు. డెవిల్ సినిమా పిరియాడిక్ బ్యాక్ గ్రౌండ్ స్పై మూవీగా రూపొందుతుంది.

ఇక కళ్యాణ్ రామ్ దీని తర్వాత ఏ మూవీలో నటించబోతున్నాడు అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. బింబిసారా సీక్వెల్ కి స్క్రిప్ట్ వరకు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ లోగా ఓ హారర్ ట్రైలర్‌లో కళ్యాణ్ రామ్ నటించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఓ దర్శకుడు చెప్పిన హారర్ థ్రిలర్ కళ్యాణ్ రామ్‌కు బాగా నచ్చడంతో ఆల్మోస్ట్ ఓకే అన్నాడని అయితే ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదంటూ తెలుస్తుంది.

సరైన టైంలో సరైన విధంగా అనౌన్స్ చేసే ఆలోచనలో కళ్యాణ్ రామ్ ఉన్నాడట. అయితే ఈ నేపథ్యంలోనే మరో వర్షన్ కూడా వినిపిస్తుంది కళ్యాణ్ రామ్ దర్శకుడిని కలిసి కథ విన్నది నిజమే కానీ పూర్తి కన్సల్ట్ ఇవ్వలేదని.. కానీ ఆ దర్శకుడు నమ్మకంతో గట్టి ప్రయత్నం చేస్తున్నాడని టాక్.