బ‌రితెగించేసిన శ్రియా.. న‌డిరోడ్డుపై కాలు పైకెత్తి ఏంటా ప‌నులు!?

సినీ ప‌రిశ్ర‌మ‌లో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పిన ముద్దుగుమ్మ‌ల్లో జాబితాలో శ్రియా ఒక‌టి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాష‌ల్లో ఎన్నో చిత్రాలు చేసింది. ఇప్ప‌టికీ అడ‌పా త‌డ‌పా చిత్రాల‌తో కెరీర్ ను కొన‌సాగిస్తూనే ఉంది. కెరీర్ ఆరంభం నుంచి వివాదాల‌కు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు దూరంగా ఉంటూ వ‌స్తున్న‌ శ్రియా.. స్కిన్ షో విష‌యంలో మాత్రం ఎప్పుడూ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటూనే ఉంది.

పెళ్లై ఓ బిడ్డ‌కు త‌ల్లైనా స‌రే శ్రియా ఎక్స్పోజింగ్ లో అస్స‌లు వెన‌క‌డుగు వేయ‌డం లేదు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో నెట్టింట కాక‌రేపుతుంటుంది. నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ చెక్కుచెద‌ర‌ని అందంతో కుర్ర‌కారు గుండెల్లో మంట పెడుతుంటుంది. తాజాగా ప‌బ్లిక్ గా బ‌రితెగించేసింది. కొద్ది రోజుల నుంచి విదేశాల్లో భ‌ర్త‌తో క‌లిసి విహరిస్తున్న శ్రియ.. తాజాగా రోమ్ నగరంలోని ప్రఖ్యాత కొలోజియం ఎదుట ఫోటోల‌కు పోజులిచ్చింది.

న‌డిరోడ్డుపై ఒక కాలు పైకెత్తి మ‌రీ వ‌ల్గ‌ర్ గా ఫోటోలు దిగింది. అలాగే మ‌రోవైపు భ‌ర్త‌కు ముద్దులు ఇస్తూ రెచ్చిపోయింది. ఈ పిక్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. నెటిజన్లు ఆమె తీరును విమ‌ర్శిస్తున్నారు. న‌డిరోడ్డిపై కాలు పైకెత్తి ఏంటా ప‌నులు శ్రియా అంటూ మండిప‌డుతున్నారు. అయితే మ‌రికొంద‌రు మాత్రం శ్రియా అందాలపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తూ లైకులు ఇచ్చేస్తున్నారు. కాగా, కెరీర్ విష‌యానికి వ‌స్తే.. మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో ఇటీవ‌ల శ్రియా ఒక సినిమా చేసింది. అయితే ఈ ఆర్ట్ ఫిల్మ్ అంతగా ఆదరణ పొందలేదు. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కబ్జా మూవీలో లీడ్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాకు సైతం ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)