ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీ, మరాఠి సీరియల్స్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్ని సినిమాలో, సీరియల్స్ నటించినప్పటికి రాని గుర్తింపు ఒకే ఒక సినిమాతో వచ్చింది. అదే ‘సీతారామం’ సినిమా. లవ్ రొమాంటిక్ డ్రామా గా తెరకేక్కిన ఈ సినిమాలో మృణాల్ ‘సీత’ పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా తరువాత మృణాల్ కి తెలుగు, తమిళ్, ఇలా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.
ఆమె నటించిన సీత పాత్రకి ఎంతోమంది అభిమానులు అయ్యారు. సీతారామం సినిమాతో అందరూ మృణాల్ ఠాకూర్ ని ఆమె పేరు పెట్టి పిలవకుండా సీత అని పిలవడం మొదలు పెట్టారు. అంతగా సీత పాత్రలో ప్రేక్షకులను కట్టిపడేసింది మృణాల్. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ ఇండస్ట్రీ లో వరుస సినిమాలతో దుసుకుపోతుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఒక సినిమా, నేచరల్ స్టార్ నాని తో ఇంకో సినిమాలో నటిస్తుంది. అయితే ఈ మధ్య మృణాల్ ఠాకూర్ పై ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఆల్రెడీ పెళ్లి అయిన నాని పై మృణాల్ ఠాకూర్ మోజుపడిందని వార్త చక్కర్లు కొడుతుంది.
ఈ విషయం పక్కన పెడితే మృణాల్ తన ఇంస్టాగ్రామ్ పేజీ లో పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న ఫోటో ని షేర్ చేసింది. ఆ ఫోటో చూసిన చాలా మంది ‘మృణాల్ ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మృణాల్ షేర్ చేసిన ఫొటోలో ఆమె రెడ్ కలర్ లెహంగా వేసుకొని, నగలు పెట్టుకొని, చేతులకు మెహందీ కూడా పెట్టుకొని అచ్చం పెళ్లి కూతురిలా కనపడింది. ఇది చూసిన మృణాల్ ఫ్యాన్స్ ‘ఎవరికి చెప్పకుండా పెళ్లి చూసుకున్నావా’ అంటూ ఫీల్ అవుతున్నారు. మరి పెళ్లి విషయం పై మృణాల్ ఏదో ఒక క్లారిటీ ఇవ్వకపోతే ఆమె ఫ్యాన్స్ ఊరుకునేలా లేరు.