స్నేహ రెడ్డికి అల్లుఅర్జున్ తల్లి పెట్టిన కండిషన్ ఇదే..షాక్ అవ్వాల్సిందే 

ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ట్రోల్ల్స్ తో మొదలైన తన ప్రయాణం ఇప్పుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. పుష్ప సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఇక పుష్ప 2 మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అల్లుఅర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి తెలియని వారుండరు. అల్లుఅర్జున్ లానే ఎప్పుడు స్టైలిష్ గా ఉంటుంది. ఇప్పటికి వీరి జంటను చూసి చాలా మంది జంట అంటే ఇలానే ఉండాలని అంటున్నారు. స్నేహ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అయితే ఆ ఫోటోలని చూసిన వారందరు పాజిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు.

అయితే పెళ్ళికి ముందే స్నేహ రెడ్డికి అల్లుఅర్జున్ తల్లి అల్లు నిర్మల ఒక కండిషన్ పెట్టారట. ఆ కండిషన్ ని ఒప్పుకుంటేనే పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఆ కండిషన్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. అల్లు నిర్మల ముందు అల్లుర్జున్ కి బంధువుల్లో ఉన్న అమ్మాయితో పెళ్లి చేయాలని అనుకున్నారట. కానీ అప్పటికే అల్లుఅర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించారు. ఈ విషయమే అల్లుఅర్జున్ ఇంట్లో చెప్పారు. దీంతో నిర్మల్ ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఒక కండిషన్ కి ఒప్పుకుంటేనే స్నేహ రెడ్డితో పెళ్ళికి ఒప్పుకుంటానని చెప్పారు. పెళ్లి ఎలాగో నేను చూసిన అమ్మాయిని చేసుకోలేదు. కనీసం పెళ్లి తరువాత విషయాలైన నేను చెప్పినట్టు వినాలని చెప్పారంట. దీనికి అల్లుఅర్జున్ కూడా సరే నీ మాటే వింటానని చెప్పారు.

ఆ తరువాత అల్లు నిర్మల్ స్నేహ రెడ్డి దగ్గరికి వెళ్లి మాట్లాడారంటే. నువ్వు అల్లుఅర్జున్ ని పెళ్లి చేసుకున్నాక రెండు మూడు సంవత్సరాలలోపే మా ఇంటికి మనవడో మనవరాలో రావాలి.. అంతేగానీ పెళ్లి తర్వాత పిల్లల కోసం గ్యాప్ తీసుకుంటాం అంటే కుదరదు. నాకు మాత్రం కచ్చితంగా పెళ్లైన రెండు మూడు సంవత్సరాలలోపు మనవడో మనవరాలో కావాలి అని కండిషన్ పెట్టారంటే. ముందు ఈ మాటలకు భయపడిన స్నేహ రెడ్డి ఆ తరువాత ఆ కండిషన్ కి ఓకే చెప్పిందట. ఇక అత్తకి ఇచ్చిన మాట ప్రకారమే పెళ్లయిన రెండు సంవత్సరాల లోపు అల్లు అర్జున్ దంపతులకు అల్లు అయాన్ జన్మించాడు. ఆ తరువాత అల్లు అర్హ జన్మించింది. ఇప్పుడు అల్లుఅర్జున్ ఫ్యామిలీతో సంతోషంగా ఉంటున్నారు.