శ్రీలీలను శ్రీదేవిగా, వైష్ణవిని జయసుధగా పోలిక.. శ్రీరెడ్డిని ఎవరితో పోలుస్తారో!

సాధారణంగా ఏవరైనా యంగ్ హీరోయిన్ నటన బాగుంటే చాలు వారిని సీనియర్ హీరోయిన్స్ తో పోల్చేస్తుంటారు ప్రేక్షకులు. అంతేకాకుండా ఆ యంగ్ హీరోయిన్ల కు సీనియర్ స్టార్ హీరోయిన్లకు మధ్య ఏదయినా దెగ్గర పోలిక ఉంటే వాళ్ళని జూనియర్ అనే ట్యాగ్ పెట్టి ఆ సీనియర్ హీరోయిన్ల పేర్లతో పిలుస్తుంటారు. అలానే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది హీరోయిన్ల ను సీనియర్ హీరోయిన్ల పేర్లతో పిలుస్తున్నారు తమ అభిమానులు.

ఈ క్రమంలోనే ఇటీవలే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి వరుస సినిమాలతో దుసుకుపోతున్న శ్రీలిలను కూడా ఒక స్టార్ హీరోయిన్ తో పోలుస్తూ ఆమె అభిమానులు మురిపోతున్నారు.

శ్రీలీల తన అందం, నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ అమ్మడు డాన్స్ కూడా ఇరగదీస్తుంది. దాంతో స్టార్ హీరోలు ఈ చిన్నదానిపై మనసు పారేసుకుంటున్నారు. అలానే ఒకప్పటి స్టార్ హీరోయిన్ పై కూడా చాలా మంది హీరోలు మనసు పారేసుకుని తమ అభిమానాని చూపించారు. ఆ స్టార్ హీరోయిన్ మరెవరు కాదు ‘శ్రీదేవి ‘. శ్రీదేవి అందం గురించి, నటన గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే. దాంతో ఇప్పుడు శ్రీదేవి అభిమానులను ఆమెను శ్రీలీల లో చూసుకుంటున్నారు. అభిమానులే కాకుండా ఒక సీనియర్ నటుడు కూడా ఒక వేదిక పై కాభోయే శ్రీదేవి యే శ్రీలల అని చెప్పాడు.

ఇక తాజాగా బేబీ సినిమా తో మంచి క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా లోనే ఈ అమ్మడు అధరగొట్టేసింది. దాంతో ఈమెకి ఉన్నటుంది ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా  వైష్ణవి ని చూసి ‘ రాసి పెట్టుకోండి ఈ అమ్మాయి మరో జయసుధ అవుతుంది ‘ అని కామెంట్ చేసారు. దాంతో చిరు చేసిన కామెంట్స్ విన్న చాలా మంది శ్రీరెడ్డి ని మధ్యలోకి లాగి ‘మరి శ్రీరెడ్డి ని సిల్క్ స్మిత అనుకోవచ్చా ‘ అంటూ ఎటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెలుగు అమ్మాయిల కోసం రచ్చ రచ్చ చేసిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆ రచ్చ కారణంగా ఈ అమ్మడి కి ఇండస్ట్రీ లో అవకాశాలు రాకపోయినప్పటికి సోషల్ మీడియా ద్వారా అందరికి టచ్ లో ఉంటు వివాదలను సృష్టిస్తూ ఉంటుంది.