మెగా అభిమానులకి వరుణ్-లావణ్య బిగ్ షాక్.. రేపో మాపో పెళ్ళి అనగా.. ఇలా చేసారు ఏంటి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. నిశ్చితార్ధం మాత్రం చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా చేసుకున్నారు . అయితే నవంబర్లో వీళ్ల పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ముహుర్తాన్ని ఆగస్టు 25కి మార్చేసుకున్నారట మెగా ఫ్యామిలీ .

దీనికి సంబంధించిన పనులు సైతం చక చక పూర్తి చేసేస్తుంది మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో అంటూ టాక్ వినిపిస్తుంది. దీనికి తగ్గట్టే వరుణ్ – లావణ్య కూడా ఇటలీలో దిగిన ఫొటోస్ నెట్టింట వైరల్ కావడంతో త్వరలోనే వీళ్ళ పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి . కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లావణ్య త్రిపాఠి వరుణ్ పెళ్లి ఇటలీలో జరగబోతుందని.. అయితే ఈ పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు అటెండ్ కావడం లేదని .. కేవలం 50 మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతున్నారు అని సెక్యూరిటీ దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది .

లావణ్య త్రిపాఠి కుటుంబం నుండి మెగా ఫ్యామిలీ నుండి మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతున్నారని మిగతా వాళ్ళందరూ హైదరాబాద్లో ఇచ్చే రిసెప్షన్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది . అయితే ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో ఇంత నిరాడంబరంగా పెళ్లి చేసుకున్న మెగా హీరోనే లేరు . అందరి పెళ్ళికి వేలల్లో జనాభా వచ్చారు . కాని వరుణ్ పెళ్లికి మాత్రం నాగబాబు ఇలా సింపుల్ వేలో అయిపోగొట్టేస్తున్నారు. దీంతో మెగా అభిమానులు షాక్ అయిపోతున్నారు. రేపో మాపో పెళ్లి అందరి హీరోలు కలిసి నీ పెళ్లిలో సందడి చేస్తే చూడాలనుకున్నాం ఇలాంటి షాక్ ఇచ్చారు ఏంటి మీరు..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.