కైకలూరుపై జనసేన గురి..టీడీపీ వదులుకున్నట్లే.!

వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్న చంద్రబాబు..ఎన్నికలకు ముందు నుంచే నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని నియోజకవర్గాల్లో టి‌డి‌పికి ఇంకా ఇంచార్జ్‌లు లేరు..ఆ సీట్లని వ్యూహాత్మకంగా చంద్రబాబు వదిలేశారా? జనసేనకు ఇవ్వడం కోసం ఖాళీగా ఉంచారా? అనే ప్రచారం వస్తుంది.

ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు సీటులో టి‌డి‌పి ఇంచార్జ్ ఎవరు లేదు. మొన్నటివరకు ఇంచార్జ్ గా పనిచేసిన జయమంగళ వెంకటరమణ వైసీపీలోకి వెళ్లారు. దీంతో అక్కడ టి‌డి‌పికి ఇంచార్జ్ లేరు. పలువురు నేతలు కైకలూరు సీటు కోసం ట్రై చేస్తున్నారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ లాంటి వారు సీటు ఆశిస్తున్నారు. కానీ బాబు వారికి సీటు ఇవ్వలేదు. ఇదే సమయంలో పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకు దక్కే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. 2014 ఎన్నికల్లో టి‌డి‌పి పొత్తులో భాగంగా బి‌జే‌పి నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేసి గెలిచారు.

ఇప్పుడు జనసేనకు ఆ సీటు వదిలే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కానీ 2019 ఎన్నికల్లో అక్కడ జనసేనకు పడిన ఓట్లు కేవలం 10 వేలు మాత్రమే..అదే 2009లో ప్రజారాజ్యంగా 49 వేల ఓట్లు పడ్డాయి. అంటే కాపుల ఎక్కువగా ఉన్నా సరే గత ఎన్నికల్లో ఆ వర్గం ఓట్లు వైసీపీకే ఎక్కువ పడ్డాయి. కానీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుపై యాంటీ ఎక్కువగా ఉంది. దీంతో ఈ సారి కాపుల ఓట్లు వైసీపీకి పడటం కష్టం.

జనసేన సైతం బలపడుతుంది. కాకపోతే గత ఎన్నికల్లో టి‌డి‌పికి 72 వేల ఓట్లు వరకు పడ్డాయి..ఒకవేళ జనసేనకు సీటు ఇస్తే..టి‌డి‌పి ఓట్లు మొత్తం జనసేనకు షిఫ్ట్ అవ్వాలి..అప్పుడే గెలవగలదు. లేదంటే గెలుపు అసాధ్యం.