రానా దరిద్రానికి అంత అన్ ల‌క్కీ హీరోనా.. అందుకే అన్ని సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడా..!?

టాలీవుడ్ లోనే విలక్షణ‌ నటుడుగా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లెజెండ్రి నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా.. హీరోగా, విలన్ గా మరియు, వ్యాఖ్యాతగా తనదైన రీతిలో ప్రేక్షకులను అలరించాడు. విలక్షణ న‌టుడిగా పేరు తెచ్చుకున్నాడు కానీ టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒక్కడిగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయాడు. రానా హీరోగా చేసిన సినిమాల్లో అత్యధిక శాతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే గతంలో రానా చేతులారా కొన్ని సూపర్ హిట్ సినిమాలను కావాలని వదులుకున్నాడు.

ఆ సినిమాలు ఏంటో తెలిస్తే రానా నిజంగానే దరిద్రానికి అంత దగ్గరగా ఉంటాడా అని అనకుండా ఉండలేరు. ఇక మరి రానా చేతులారా వదులుకున్న ఆ సూపర్ హిట్ సినిమాలు ఏమిటో ఒకసారి చూద్దాం రండి. ముందుగా నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే సూపర్ హిట్ సాధించిన సినిమాల్లో పటాస్ కూడా ఒకటి.. అనిల్ రావిపూడి దర్శకుడుగా పరిచయమైన తొలి సినిమా కూడా ఇదే.. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన పటాస్ సూపర్ డూపర్ హిట్ అయి బాక్సాఫీస్ వద్ద కలక్షన్ వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాని రిజెక్ట్ చేసిన హీరోల్లో రానా కూడా ఒకరు.

దర్శకుడు అనిల్ రావిపూడి పటాస్ క‌థ‌ని ఎంతోమంది హీరోలకు వినిపించాడు. కానీ కొత్త దర్శకుడు అన్న కారణంగా ఆయనతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. అదే సమయంలో రానా దగ్గరికి కూడా పటాస్ కథ‌ వెళ్ళింది. అయితే ఏవో కారణాలతో ఆయన నో చెప్పాడు అలా రానా నుంచి చేజారిన పటాస్ కళ్యాణ్ రామ్ దగ్గరికి వెళ్లి ఆయన చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఇక అదే విధంగా విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన బిచ్చగాడు.. తమిళ, తెలుగు భాషలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీకి సిక్వల్ గా వచ్చిన బిచ్చగాడు 2 కూడా అదేవిధంగా మంచి హిట్ అయింది.

అయితే కోలీవుడ్ లో విడుదలై ఘ‌న విజ‌యం సాధించిన బిచ్చగాడు సినిమాని తెలుగులో రానాతో రీమేక్ చేయాలని అనుకున్నారట. అందుకు రానా మాత్రం ఏం మాత్రం ఒప్పుకోలేదట. దాంతో దర్శ‌క నిర్మాతలు రీమేక్ ఆలోచన మానుకొని తెలుగులోకి డబ్ చేసి బిచ్చగాడుని విడుదల చేశారు. ఇక కోలీవుడ్లో జ‌యంరవి, నయనతార జంటగా మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ.. `థాని ఒరువన్` కి కూడా మొదటి చాయిస్ రానానే అట.. ఈ సినిమాని కూడా రానా ఏవేవో కారణాలతో వదులుకోవటంతో అదే సినిమాని రామ్ చరణ్ ధ్రువ సినిమాగా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఏదేమైనా రానా పైన చెప్పిన మూడు సినిమాలను చేసి ఉంటే ఆయన కెరీర్ మరోలా ఉండేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.