బాలయ్య కారణంగానే రామ్ చరణ్ స్టార్ హీరోగా మారాడనే విషయం మీకు తెలుసా…!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకు ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించారు.. ఇప్పటికీ వ‌రుస సినిమాల్లో నటిస్తూ రాజకీయాల్లో కూడా సత్తా చాటుతున్నారు. అయితే అలాంటి బాలకృష్ణ ఆయన కెరియర్ లో ఎన్నో సినిమాలను కూడా వదులుకున్నారు. అలా బాలయ్య వదులుకున్నసినిమా కారణంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా మారాడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఇంతకీ అలా బాలయ్య వదులుకున్న ఆ సినిమా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

అలా బాలయ్య వదులుకున్న సినిమా మరేదో కాదు మగధీర దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్- కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. అల్లు అరవింద్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించగా.. కీరవాణి సంగీతం అందించారు. శ్రీహరి, దేవ్ గిల్ , శరత్ బాబు వంటి అగ్రన‌టులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలన రికార్డులను సృష్టించిందో అందరికీ తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసులు వర్షం కురిపించింది.. అప్పట్లోనే ఈ సినిమా రూ.80 కోట్లకు పైగా భారీ కలక్షన్లను రాబట్టింది. అప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హైయెస్ట్ గ్రాస్ కలక్షన్లు రాబట్టిన సినిమాగా మగధీర రికార్డ్ సృష్టించింది. అలాగే ఈ సినిమా పలు థియేటర్లో 1000 రోజులకు పైగా ఆడింది. అయితే నిజానికి ఈ సినిమాను ముందుగా బాలకృష్ణతో చేయాలని దర్శక ధీరుడు రాజమౌళి భావించాడట.

ఆ క్రమంలోనే బాలయ్య వద్దకు వెళ్లి మగధీర కథను కూడా చెప్పాడట. అయితే మగధీర కథ బాలయ్యకు ఎంతగానో నచ్చినప్పటికీ.. కొన్ని అనుకోని కారణాలతో ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించాడు. ఆ తర్వాత మగధీర సినిమా రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళగా ఆయన హీరోగా తెరకెక్కింది. ఈ సినిమాతో రామ్ చరణ్ టాలీవుడ్ అనే స్టార్ హీరోగా మారి ప్రస్తుతం గ్లోబల్ హీరోగా దూసుకుపోతున్నాడు.