గన్నవరం-గుడివాడ నియోజకవర్గాలు టిడిపి అధినేత చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న స్థానాలు..2019 వరకు గుడివాడతో తలనొప్పి అనుకుంటే..ఆ తర్వాత నుంచి గన్నవరంతో ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే టిడిపిలో మాస్ లీడర్లుగా ఎదిగి వైసీపీలో సత్తా చాటుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు. వారేమో బాబు టార్గెట్ గా ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారో చెప్పాల్సిన పని లేదు.
అందుకే వీరికి ఎలాగైనా ఈ సారి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా గన్నవరంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగిన విషయం తెలిసిందే..అటు భారీ సభ కూడా నిర్వహించారు. ఇక మొన్నటివరకు వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావుని టిడిపిలోకి తీసుకొచ్చారు. అయితే ఆయనకే గన్నవరం సీటు ఇస్తున్నారా? అంటే ఇంకా క్లారిటీ రాలేదు. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడ నుంచైనా పోటీ చేస్తానని యార్లగడ్డ చెప్పుకొచ్చారు. కానీ ఆయనకే సీటు అని టిడిపి అధిష్టానం ఫిక్స్ చేయడం లేదు. ఇప్పటికే టిడిపి సీటు కోసం పలువురు కాచుకుని కూర్చున్నారు. మరి వారిని పక్కన పెట్టి యార్లగడ్డకు సీటు ఇచ్చి.. వంశీకి చెక్ పెట్టగలరో లేదో చూడాలి.
ఇటు గుడివాడలో కొడాలి నానికి ఎదురు లేకుండా పోయింది..ఆయన వరుసగా వైసీపీ నుంచి సత్తా చాటుతూ వస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు అభ్యర్ధులని మార్చారు. అయినా నానికి చెక్ పెట్టలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే పాత రావి వెంకటేశ్వరరావుని నిలబెడతారా? లేక కొత్తగా వచ్చిన ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాముని నిలబెడతారా? అనేది క్లారిటీ లేకుండా పోయింది.
త్వరగా రెండు చోట్ల అభ్యర్ధులని ఫిక్స్ చేస్తే కొంతవరకు పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఎన్నికల సమయంలో హడావిడి చేస్తే వంశీ, కొడాలికి చెక్ పెట్టడం సాధ్యమయ్యే పని కాదు.