అనుష్క‌లో ఉన్న అద్భుత‌మైన క్వాలిటీ అదే.. న‌వీన్ పొలిశెట్టి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

సౌత్ స్టార్ అనుష్క శెట్టి, యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి జంట‌గా ఓ సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. అదే `మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి`. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకు పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహించాడు. సెప్టెంబ‌ర్ 7న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ మూవీ ట్రైల‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

సినిమాపై ప్రేక్ష‌కుల్లో మంచి క్యూరియాసిటీని పెంచింది. విడుద‌ల‌కు కొద్ది రోజులే ఉండ‌టంతో.. మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను కూడా షురూ చేశారు. ఇందులో భాగంగానే తాజాగా న‌వీన్ పొలిశెట్టి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా సినిమాకు సంబంధించి అనేక విష‌యాల‌ను పంచుకున్నాడు. అలాగే అనుష్క గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆమెలో ఉన్న అద్భుత‌మైన క్వాలిటీని రివీల్ చేశాడు.

మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి షూటింగ్ చాలా స‌ర‌దాగా సాగిపోయింద‌ని.. మొద‌టి రెండు రోజులు కాస్త భ‌య‌ప‌డినా.. ఆ త‌ర్వాత అనుష్క ఎంక‌రేజ్మెంట్ తో హ‌షారుగా షూటింగ్ లో పాల్గొన్నాన‌ని న‌వీన్ పేర్కొన్నాడు. అలాగే `సెట్స్ లోకి రాగానే అనుష్క టెక్నీషియ‌న్స్ కు ఒక వెచ్చ‌ని హ‌గ్ ఇస్తుంది. అభిమాన‌పూర్వ‌కంగా ఇచ్చే హ‌గ్ అది. ఈ హ‌గ్ వ‌ల్ల మ‌న‌సులో ఎంతో పాజిటివిటీని నింపుతుంది. ఆవిడ నుంచి నేను కూడా అలా హ‌గ్ ఇవ్వ‌డం నేర్చుకున్నా. అనుష్క‌లో ఉన్న సూప‌ర్ క్వాలిటీ అది` అంటూ న‌వీన్ పొలిశెట్టి తెలిపాడు.