బిగ్ బాస్ 7లోకి స్టార్ హీరో, హీరోయిన్‌.. ఈ ట్విస్ట్ అస్స‌లు ఊహించ‌లేదు గారూ!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టికే తెలుగులో ఆరు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకుంది. త్వ‌ర‌లోనే సీజ‌న్ 7 కూడా స్టార్ట్ అవ్వ‌బోతోంది. గ‌త నాలుగు సీజ‌న్ల‌కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జునే తాజా సీజ‌న్ కు కూడా హోస్ట్ గా చేయ‌బోతున్నారు. సెప్టెంబ‌ర్ 3న ఈ షో అట్ట‌హాసంగా ప్రారంభం కాబోతోంది. ఓవైపు వరుసగా ప్రోమోస్ రిలీజ్ చేస్తూ సీజన్ 7పై మరింత క్యూరియాసిటిని పెంచేస్తున్నారు నిర్వాహకులు.

మరోవైపు సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ ప‌లువురి పేర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. శుభశ్రీ, సింగర్ దామిని, పూజా మూర్తి, అమర్ దీప్, కార్తీకదీపం ఫేమ్‌ శోభా శెట్టి, ఆట సందీప్ కపుల్, అంజలి పవన్, పల్లవి ప్రశాంత్, అనీల్ గీలా, శీతల్ గౌతమ్, అన్షు రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఈ లిస్ట్ లో తాజాగా మ‌రో ఇద్ద‌రి పేర్లు యాడ్ అయ్యాయి. ఒక‌ప్ప‌టి స్టార్ హీరో అబ్బాస్ మ‌రియు హీరోయిన్ ఫ‌ర్జానా బిగ్ బాస్ సీజ‌న్ 7లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ట‌.

హీరోగా ఫేడౌట్ అయిన త‌ర్వాత అబ్బాస్ ఫ్యామిలీతో న్యూయార్క్ లో సెటిల్ అయ్యాడు. అయితే ఇటీవ‌ల ఈయ‌న స‌డెన్ గా ఫ్యామిలీతో ఇండియాకు తిర‌గొచ్చాడు. వ‌రుస ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ప్రేక్ష‌కుల‌కు చేరువ‌వుతున్నాడు. అయితే బిగ్ బాస్ కోస‌మే అబ్బాస్ ఇండియాకు వ‌చ్చాడ‌ని అంటున్నారు. ఇక భాగ్య‌ల‌క్ష్మి బంప‌ర్ డ్రా, సీమ శాస్త్రి, బొమ్మ‌న బ్ర‌ద‌ర్స్ చంద‌న సిస్ట‌ర్స్ వంటి సినిమాల ద్వారా పాపుల‌ర్ అయిన హీరోయిన్ ఫ‌ర్జానా కూడా బిగ్ బాస్ తాజా సీజ‌న్ లో సంద‌డి చేయ‌నుంద‌ట‌. వీరిద్ద‌రి ఎంట్రీ దాదాపు క‌ర్ఫార్మ్ అయిన‌ట్లే అని అంటున్నారు.