మహేష్ బాబు ఆస్తులు ఆదాయం తెలిస్తే ఫ్యూజులు ఔట్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణ వారసత్వాన్ని పుచ్చుకొని మరి సూపర్ స్టార్ గా రాణిస్తూ ఉన్నారు. టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా పేరుపొందిన మహేష్ బాబు స్టార్ ఇమేజెస్ సంపాదించుకున్నారు.ఈరోజు మహేష్ బాబు 48వ పుట్టినరోజు సందర్భంగా మహేష్ సంబంధించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. మహేష్ బాబు లగ్జరీ లైఫ్ బ్రాండ్ వాల్యూ భారీ సినిమాలతో తన రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు.

Mahesh Babu: Telugu Superstar Loses His Mother, Brother And Father In The  Same Year

మహేష్ బాబు హీరోగా తన కెరీర్ ను ప్రారంభించి ఇప్పటికీ 25 ఏళ్లు అవుతోంది పాలనటుడుగా పదేళ్లు నటించిన మహేష్ 10కి పైగా చిత్రాలలో నటించారు. ఎక్కువగా తన తండ్రి సినిమాలోనే నటించారు మహేష్ బాబు 1999లో రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు హీరోగా పరిచయం చేశారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుగా రాణించారు. మహేష్ బాబు మొదట మురారి సినిమాతో మంచి బ్రేక్ అందుకున్నారు.

ఒక్కడు సినిమాతో స్టార్ స్టేటస్ ని అందుకున్న మహేష్ హీరోగా నెక్స్ట్ లెవెల్ లో పోకిరి సినిమాతో తిరుగులేని స్టార్ డమ్ అందుకున్నారు. కలెక్షన్ల పరంగా టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. తర్వాత దూకుడు, బిజినెస్ మెన్, శ్రీమంతుడు, SVSC, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించారు. హీరోగా 27 సినిమాలలో నటించిన మహేష్ ఒక్కో చిత్రానికి 80 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. పలు రకాల యాడ్స్లో బిజీగా ఉన్న మహేష్ బాబు యార్డ్ల ద్వారా కూడా సుమారుగా ఏడాదికి రూ.60 కోట రూపాయలకు పైగా ఆదాయం వస్తోందట. కృష్ణ గారి నుంచి మహేష్ వారసత్వంగా ఎలాంటి ఆస్తిని కూడా తీసుకోలేదట. తన మనవరాళ్ల మీద మనవడు మీద ఆస్తి రాసినట్టు సమాచారం. మహేష్ బాబు నమ్రతా నుంచి సుమారుగా రూ.2000 కోట్ల రూపాయల ఆస్తి వచ్చినట్టు సమాచారం. మహేష్ బాబు సినీ కెరియర్ల సంపాదించిన ఆస్తి విషయానికి వస్తే మహేష్ బాబు ఇల్లు రూ.50 కోట్ల రూపాయలు ఉంటుందట. కార్లు విలువ సుమారుగా 35 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. బైక్ రూ.3 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం మహేష్ బాబు ఆస్తి విలువ రూ.13 వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం.