శ్రీ లీలనే రిజెక్ట్ చేసిన స్టార్ హీరో…. అసలు కారణం ఇదా….!

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం పెళ్లి సందడి. ఈ సినిమాతో శ్రీ లీల టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం రవితేజ తో జతకట్టి ధమాకా సినిమాలో హీరోయిన్గా నటించినంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం శ్రీ లీల తొమ్మిదికి పైగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. శ్రీ లీల రేంజ్ ఒక ఎత్తులో ఉండడం వల్ల నిర్మాతలు స్త్రీ లీల కాల్‌షీట్ల కోసం క్యూ కడుతున్నారు.

ఇంకా యంగ్ హీరోస్ కూడా మొదట ఈమె పేరే చెప్పడంతో దర్శకులు కూడా శ్రీ లీల కోసం క్యూ కడుతున్నారు. శ్రీ లీల అన్ని సినిమాలు చేయలేక కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తుంది. కానీ ఓ హీరో మాత్రం శ్రీ లీలనే రిజెక్ట్ చేశాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసే అంత రేంజ్ ఎవరికుంది అనే విషయం గురించి చర్చలు మొదలుపెట్టారు. అయితే శ్రీ లీలను రిజెక్ట్ చేసిన హీరో మరెవరో కాదు ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఒకరు శ్రీ లీల అంటూ టాక్ నడిచింది. కానీ శ్రీ లీల ఈ సినిమాలో నటించడానికి ప్రభాస్ ఒప్పుకోలేదట. ప్రభాస్ ని చూస్తే ఆరడుగులు ఉంటాడు. కానీ శ్రీ లీల చాలా పొట్టిగా ఉంటుందని ఒకే ఒక్క కారణంతో శ్రీ లీలా ని రిజెక్ట్ చేశాడని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.