మహేష్ బాబు నటించిన ఆ సినిమా చూసి రిమోట్ ప‌గ‌ల‌గొట్టిన నమ్ర‌త‌…!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది క్యూట్ కప్పులు ఉన్నా సరే మహేష్ బాబు, నమ్రత జంట అంటే అందరికీ ఇష్టం. ముఖ్యంగా నమ్రతాని ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసినా సరే పెళ్లి తర్వాత భర్త, పిల్లలు ప్రపంచం అంటూ తన కెరియర్ వదిలేసుకుంది నమ్రత. తాజాగా నమ్రత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత కు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా అనే ప్రశ్న ఎదురయింది.

నో అంటూ మొఖం మీద చెప్పేసింది. మహేష్ సినిమాలో కూడా నటించారా అంటే మహేష్ నన్ను అడగడు నేను కూడా నటించను అని ఓపెన్ గా చెప్పేసింది. ఆ ఇంటర్వ్యూలో మీకు మహేష్ బాబు సినిమాల్లో నచ్చని సినిమా ఏమిటి అని అడిగితే సైనికుడు అని నిర్మొహమాటంగా చెప్పేసింది. ఆ సినిమా చూస్తూ ఓ సారి రిమోట్ కూడా ప‌గ‌ల‌గొట్టింద‌ట‌. ఆ సినిమా మహేష్ బాబుకి కూడా నచ్చదని పలు ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఉన్నాడు.

ప్రస్తుతం గుంటూరు కారం సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గుంటూరు కారం విష‌యానికి వ‌స్తే ఇక్కడేమో సూపర్ స్టార్, అక్కడేమో మాటల మాంత్రికుడు ఇద్దరు కలిస్తే సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు.