పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఓజి. ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఇప్పటికే కీలకమైన ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేసేసాడు. ప్రియాంక అరుళ్ మోహన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హస్మీ ప్రతి నాయకుడిగా
కనిపించబోతున్నాడట. అమితాబచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో పోషిస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ లాంటి ప్రామిసింగ్ యాక్టర్స్ సినిమాలో నటిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా దీనిని నిర్మిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో షూటింగ్ ఇంకా పూర్తి చేయలేకపోయారు. ఓ 30 రోజులు పవన్ డేట్లు ఇస్తే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేస్తానికి సుజిత్ సిద్ధంగా ఉన్నాడట. వారాహి యాత్ర మూడో విడత తరువాత కొన్ని రోజులు డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాపై ఇప్పటి నుంచే బిజినెస్ ప్లాన్ లో నిర్మాత డివివి దానయ్య ఉన్నాడట. సుజిత్ సాహో తర్వాత సినిమా కావడంతో అతనికి పాన్ ఇండియా లెవెల్ లో మార్కెట్ ఉంటుంది.
సాహో తెలుగులో ఆశించిన సక్సెస్ రాకపోయినా హిందీలో మాత్రం సూపర్ హిట్ అయింది. దీనితో OG మూవీ పై 140 నుంచి 150 కోట్లు వరకు బిజినెస్ చేయాలని దానయ్య ప్లాన్ చేసుకుంటున్నాడట. పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పటివరకు 100 నుంచి 120 కోట్లు మధ్య బిజినెస్ చేశాయి. పవన్ ఈ మధ్యన సినిమాలు పెద్దగా సక్సెస్ కూడా సాధించలేదు.
కానీ దానయ్య మాత్రం OG మూవీ 150 కోట్లు రికార్డ్ ని సృష్టించాలని ఆశిస్తున్నాడు. యావరేజ్ స్టోరీ కి కూడా తన మేకింగ్ తో అద్భుతంగా ప్రజెంట్ చేయడం సుజిత్ గొప్పతనం. అయితే ఫస్ట్ లుక్, టీజర్ వస్తే సినిమాపై డివివి ఎక్స్పెక్ట్ చేసిన బిజినెస్ జరుగుతుందా లేదా అనేది తెలిసిపోతుంది.