ఆమె చేసిన తప్పే రఘువరన్ ప్రాణాలు తీసిందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు రఘువరన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా నాగార్జున నటించిన శివ చిత్రంలో భవాని పాత్రలో నటించి మెప్పించిన రఘువరన్ భాషా సినిమాలో కూడా ఆంటోనీ పాత్ర నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక అలా ఎన్నో తన కెరియర్ లో విభిన్నమైన పాత్రలలో నటించిన రఘువరన్ తండ్రిగా, కమెడియన్ గా, విలన్ గా ఎన్నో పాత్రలలో నటించి మెప్పించారు.

Actor Raghuvaran: மகன் கொடுத்த வலி.. விரக்தியின் உச்சத்திற்கு சென்ற ரகுவரன்.. மகா கலைஞனை நொறுக்கிய திருமண முறிவு!-actor raghuvaran death moments shared by raghuvaran brother ...

ముఖ్యంగా రఘువరన్ చెప్పే డైలాగులు మాడ్యులేషన్ గా ఉంటాయని చెప్పవచ్చు. తెలుగు , కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషలలో కూడా సుమారుగా 200 పైగా చిత్రాలలో నటించిన రఘువరన్ తన నటన ప్రతిభకు ఎన్నో అవార్డులు , ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది. ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ప్రముఖ నటి రోహిణిని 1996లో ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు రఘువరన్. వీరికి 2000 సంవత్సరంలో వరుణ్ రిషి అనే బాబు కూడా జన్మించారు. కొన్ని కారణాల చేత 2004లో వీరిద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది.

Actor Raghuvaran: மகன் கொடுத்த தனிமை தீ.. வெக்கையில் வாடிய ரகுவரன்.. ஆட்டிப்படைத்த குடி பழக்கம்! - சகோ பேட்டி!-actor raghuvaran brother ramesh shared his raghuvaran death secerts ...

ఆ సమయంలోనే రఘువరన్ మద్యానికి బానిసై పలు అనారోగ్య సమస్యలతో 2008లో మార్చి 19న కన్నుమూయడం జరిగింది. చనిపోయినా ఆయన సినిమాల రూపంలో ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.ఇక ఆయన వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఆయన సోదరుడు రమేష్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో హాజరై తెలియజేయడం జరిగింది.తన అన్న రఘువరన్ విడాకులు తీసుకున్నాక కోర్టు పర్మిషన్తో ప్రతి శనివారం తన కొడుకు దగ్గరకు వెళ్లే వారట.. అలా తన కొడుకు నాన్న నాన్న అని పిలుస్తూ ఉన్న సమయంలో కొడుకు మీద ప్రేమను బయటకు చూపిస్తూనే లోపల చాలా బాధపడేవాడు. నాన్న అని పిలుపు శనివారం మాత్రమే ఉంటుంది అనే విషయాన్ని గుర్తుతెచ్చుకున్నప్పుడల్లా చాలా మానసికంగా కృంగిపోయే వారట. తన భార్యని పిల్లలని తలుచుకొని మద్యానికి బానిసై గుండె నొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్ళినా ఫలితం లేదని తెలియజేశారు రమేష్.