బ్రేకింగ్‌: హార్ట్ ఎటాక్‌తో హీరో నితిన్ మూవీ డైరెక్ట‌ర్ మృతి

ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన మలయాళ డైరెక్టర్ సిద్ధిక్ (63) కన్నుమూశారు. గత రెండు రోజులుగా అనారోగ్య సమస్యలతో క్రిటికల్ కండిషన్ లో ఉన్న ఈయన ఇటీవల చివరిశ్వాస విడిచారు. దీంతో మలయాళ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. హీరోయిన్ కీర్తి సురేష్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, హీరో మోహన్‌లాల్ లాంటి ఎంతోమంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

సోమవారం మధ్యాహ్నం దర్శకుడు సిద్ధిక్‌కి గుండుపోటు రావ‌డంతో కేరళలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న సిద్ధిక్ కి న్యూమోనియా ఉన్నట్లు డాక్టర్స్ వివరించారు. మరోవైపు ఈయన ఆరోగ్యం విషమించడంతో ఎక్మో సాయంతో చికిత్స అందించారట. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ప్రాణాలు వదిలారు సిద్ధిక్.

సిద్ధిక్‌ అసలు పేరు సిద్ధిక్‌ ఇస్మాయిల్. డైరెక్టర్ గానే కాకుండా స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్ గాను వ్యవహరించిన ఈయన మలయాళీ నటుడు మోహన్ లాల్ కు బెస్ట్ ఫ్రెండ్. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అవి అద్భుతమైన సక్సెస్ అందుకున్నాయి. ఈయన మెగాస్టార్ చిరంజీవి కి కూడా హిట్ సినిమా అందించాడు. చిరు హిట్ సినిమా హిట్ల‌ర్ క‌థ సిద్ధిక్‌దే.

మమ్ముట్టి హీరోగా హిట్లర్ పేరుతోనే మలయాళం లో తీసిన సినిమానే తెలుగులో చిరు హీరోగా రీమేక్ చేశారు. పలు భాషలో రీమేక్ అయిన బాడీగార్డ్ వర్జినల్ దర్శకుడు కూడా సిద్ధిక్. తెలుగులో నితిన్ హీరోగా మారో సినిమాకు దర్శకత్వం వహించాడు కాకపోతే ఇది ఆడలేదు. దీని తర్వాత సిద్ధికి ఇక తెలుగు సినిమాలు దర్శకత్వం వహించలేదు.