త్రివిక్రమ్ కు మహేశ్ అంటే అంత కోపమా..? పుట్టినరోజు కూడా ఈ పనులు ఏంటి సామి..!

నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు పుట్టినరోజు . ఈరోజుని అభిమానులు ఎంతో ఘనంగా ఆహ్లాదకరంగా సందడిగా మార్చేస్తున్నారు . కాగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా సరే మహేష్ బాబు పేరే వినిపిస్తుంది . మరి ముఖ్యంగా మహేష్ బాబు అంటే చాలామంది సినీ స్టార్స్ కి కూడా ఇష్టం అందుకే సోషల్ మీడియాలో ఆయనకు స్పెషల్గా విష్ చేస్తున్నారు . ఆయన భార్య నమ్రత సైతం స్పెషల్ గా విష్ చేసింది .

ఇలాంటి క్రమంలోనే ఆయన నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . అయితే ఈ పోస్టర్లో మహేష్ చాలా హాట్ లుక్స్ లో కనిపించాడు . పైన స్టైలిష్ గా ట్రెండీ షర్ట్ వేసుకుని కింద మాత్రం మాస్ యాంగిల్ లో లుంగీకట్టుకొని నోట్లో బీడీ ..చేతుల్లో అగ్గిపెట్టి పెట్టుకొని కళ్ళకు గ్లాసెస్ పెట్టుకొని చాలా అల్ట్రా స్టైలిష్ మాస్ లుక్ లో కనిపించారు .

అయితే పోస్టర్ బాగున్నప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఏ టీజర్ నో.. ట్రైలర్ నో వదిలితే బాగుండేది అని ..కేవలం ఒక్క పోస్టర్ తోనే మహేష్ బాబు హ్యాపీ బర్త డే ను ముగించేసాడని ఫీల్ అవుతున్నారు . అంతేకాదు త్రివిక్రమ్ కి మహేష్ బాబుకు మధ్య ఏదో గొడవలు అంటూ ప్రచారం జరుగుతుంది . పుట్టినరోజు నాడు కూడా ఇలాగే చేశాడు త్రివిక్రమ్ అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అంతేకాదు త్రివిక్రమ్ కి మహేష్ అంటే అంత కోపమా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . మొత్తానికి గుంటూరు కారం సినిమా రిజల్ట్ ఏదో తేడా కొట్టే విధంగానే ఉంది అంటున్నారు ఫ్యాన్స్..!!