పల్నాడులో చినబాబు జోరు..కానీ అదే మైనస్..!

పౌరుషాల పురిటి గడ్డ పల్నాడులో రాజకీయంగా వైసీపీదే ఆధిక్యం అనే సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇటు రెడ్డి, అటు కమ్మ వర్గాల హవా ఉండే పల్నాడులో వైసీపీకి క్లియర్ కట్ మెజారిటీ ఉంది. గత ఎన్నికల్లో పల్నాడులోని అన్నీ సీట్లని వైసీపీనే కైవసం చేసుకుంది. పెదకూరపాడు, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసారావుపేట, మాచర్ల, గురజాల స్థానాలని గెలుచుకుంది.

అయితే ఈ సారి పల్నాడులో వైసీపీకి చెక్ పెట్టాలని టి‌డి‌పి చూస్తుంది. పైగా ఆ ప్రాంతంలో టి‌డి‌పిలో కమ్మ నేతలు..బాగా కసి మీద ఉన్నారు. ఇదే సమయంలో నారా లోకేష్ పాదయాత్ర పల్నాడులో ఎంట్రీ ఇచ్చింది. వినుకొండ, మాచర్ల, గురజాలలో పాదయాత్ర కొనసాగింది. మూడు చోట్ల లోకేష్ పాదయాత్రకు భారీగానే జనం వచ్చారు. సభల్లో కూడా నిండుగానే కనిపించారు. అయితే అక్కడ టి‌డి‌పి నేతలు బాగా మాస్ ఫాలోయింగ్ నేతలు కావడంతో భారీ స్థాయిలో టి‌డి‌పి శ్రేణులని తీసుకొచ్చారని చెప్పవచ్చు. అలా మూడు చోట్ల లోకేష్ సభలు హిట్ కావడంతో టి‌డి‌పి శ్రేణుల్లో జోష్ నెలకొంది.

కానీ లోకేష్ సభలు చూసి మురిసిపోవద్దు అని, గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఇంతకంటే భారీగా వచ్చారని చెప్పి వైసీపీ శ్రేణులు గతంలో వినుకొండ, మాచర్లలో జరిగిన సభల వీడియోలని వేసి చూపిస్తున్నారు. వాస్తవానికి లోకేష్ కంటే జగన్‌కే జనం ఎక్కువ వచ్చారు. ఇక లోకేష్ పాదయాత్ర వల్ల వైసీపీ బలంగా ఉన్న మాచర్ల, గురజాలలో  పట్టు ఏమి తగ్గదు.

పూర్తిగా వైసీపీ అధిక్యమే ఉంది. ఒక వినుకొండలో పోటాపోటి ఉంది. కాబట్టి లోకేష్ పాదయాత్ర ప్రభావం పెద్దగా లేదనే చెప్పుకోవాలి.