భోళా శంకర్ విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్.. వెంటనే ఆ ట్వీట్ చేసిన మహేష్..!

మోహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళాశంకర్’  సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. దాంతో వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా గురించి ఒక ట్వీట్ చేశాడు. మహేష్ కూడా ‘భోళా శంకర్’ సినిమా కోసం ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. భోళా శంకర్ సినిమా ఈరోజు విడుదల అవుతున్న సందర్భంగా మహేష్ బాబు తన పోస్టులో ‘ చిరంజీవి సార్ కి, నా ప్రియ మిత్రుడు మోహర్ రమేష్ కి, అలానే నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకరకు బెస్ట్ విషెస్ చెప్తున్నాను ‘ అని రాసుకొచ్చాడు.

అలానే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కొనిదెల నాగబాబు కూడా స్పందిస్తూ ‘ శుక్రవారం రోజు భోళా శంకర్ సినిమా థియేటర్స్ లో విడుదల కాభోతున్న సందర్భంగా ఆ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను ‘ అని చెప్పారు. ఇక భోళా శంకర్ సినిమాని చూడడం కోసం బుక్ చేసుకున్న టికెట్లను ఫోటో తీసి అభిమానులతో షేర్ చేసుకున్నారు సంపత్ నంది. అలానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు కూడా తెలిపారు.

అయితే ఈ సినిమా నిర్మాతలు తనను మోసం చేశారని సత్యనారాయణ అనే డిస్ట్రిబ్యూటర్ ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆ పిటిషన్ను కోర్టు కొట్టేసినట్లు ప్రకటించింది. దాంతో భోళా శంకర్ సినిమాకు లైన్ క్లియర్ అయి ప్రేక్షకుల ముందుకు ఈరోజు వచ్చేసింది. ఇక ఈ సినిమా లో చిరంజీవి సరసన తమన్న హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్, శ్రీముఖి లు కీలక పాత్రలో నటించారు. భోలా శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.