5వ రోజుకు మ‌రింత దిగ‌జారిన `బ్రో` క‌లెక్ష‌న్స్‌.. ఇంకా ఎన్ని కోట్లు రాబ‌ట్టాలో తెలిస్తే మైండ్ బ్లాకే!

రియ‌ల్ లైఫ్ లో మామాఅల్లుళ్లు అయిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ రీల్ లైఫ్ లో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరి కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రం `బ్రో`. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన వినోద‌య సిత్తంకు రీమేక్ గా సముద్ర‌ఖ‌ని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. జూలై 28న విడుద‌లైన బ్రో మూవీకి మిక్స్డ్ టాక్ ల‌భించింది.

అయినా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ్యానియాతో వీకెండ్ వ‌ర‌కు బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంది. కానీ, వ‌ర్కింగ్ డేస్‌లోకి ఎంట‌ర్ అయ్యాక బాగా వీక్ అయింది. మొద‌టి మూడు రోజుల్లో రూ. 50 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూళ్ల‌ను అందుకున్న బ్రో.. ఆ త‌ర్వాత జోరు చూపించ‌లేక‌పోబోతోంది. 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.36 కోట్లు వ‌సూల్ చేసిన ఈ సినిమా.. 5వ రోజు రూ. 1.68 కోట్ల‌తో స‌రిపెట్టుకుంది.

అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 2.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ రూ. 98.50 కోట్లు కాగా.. ఐదు రోజుల్లో బ్రో రూ. 60.42 కోట్ల షేర్‌, రూ.101.10 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను అందుకుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా రూ. 38.08 కోట్ల షేర్ ని రాబ‌ట్టాల్సి ఉంటుంది. కానీ, 5వ రోజుకే ఈ సినిమా వ‌సూళ్లు బాగా దిగ‌జారాయి. మ‌రి మామాఅల్లుళ్లు బ్రోతో క్లీన్ హిట్ కొడ‌తారా.. లేదా.. అన్న‌ది చూడాలి. ఇక ఏరియాల వారీగా బ్రో మూవీ 5 డేస్ టోట‌ల్‌ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి…

నైజాం: 19.16 కోట్లు
సీడెడ్: 6.21 కోట్లు
ఉత్త‌రాంద్ర‌: 6.31 కోట్లు
తూర్పు: 4.19 కోట్లు
పశ్చిమ: 3.92 కోట్లు
గుంటూరు: 4.22 కోట్లు
కృష్ణ: 3.05 కోట్లు
నెల్లూరు: 1.54 కోట్లు
—————————————–
ఏపీ+తెలంగాణ‌= 48.60 కోట్లు(76.55 కోట్లు~ గ్రాస్)
—————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 5.42 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 6.40 కోట్లు
———————————————-
టోటల్ వరల్డ్ వైడ్= 60.42 కోట్లు(101.10 కోట్లు~ గ్రాస్)
———————————————-