సమంత, మృణాల్‌కు పట్టిన గతే రష్మికకు కూడా పడుతుందా…

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’ . ఈ సినిమా షూటింగ్ సమయంలో సమంత బర్త్ డే రావడంతో విజయ్ దేవరకొండ ఆమె బర్త్ డే ని చాలా గ్రాండ్ గా, సర్ప్రైసింగ్ గా సెలబ్రేట్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో సమంతతో కేక్ కట్ చేపించి ఆమెని సర్ప్రైజ్ చేశాడు. ఒక ఫేక్ షూటింగ్ షాట్ ని కుడా ప్లాన్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. సమంత తన జీవితంలో లో మర్చిపోలేని విధంగా విజయ్ ఆమె బర్త్డే ని సెలెబ్రేట్ చేసాడు.

తాజాగా ఇంకో హీరోయిన్ బర్త్డే ని కూడా విజయ్ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసాడు. అయితే ఆమె మరెవరో కాదు ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం పరశురాం దర్శకత్వం వహిస్తున్న సినిమా లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్నారు . అ సినిమా షూటింగ్ సమయంలో మృణాల్, విజయ్ ల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. దాంతో ఆమె పుట్టినరోజు ని చాలా డిఫరెంట్ గా జరిపాడు విజయ్. మృణాల్ బర్త్డే ని చేసి ఆమెతో పాటు, అందరికి ఆశ్చర్యానికి గురి చేసాడు విజయ్ దేవరకొండ.  ఈ విషయం గురించి ఇండస్ట్రీ లో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.


షూటింగ్స్ ద్వారా ఫ్రెండ్స్ అయిన సమంత, మృణాల్ ల బర్త్డే లే అంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసినప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ రష్మిక బర్త్డే ని ఇంకెంత సర్ప్రిసింగ్ గా చేస్తాడో విజయ్ అంటూ చాలామంది గుసగుసలాడుతున్నారు. విజయ్, రష్మిక ల మధ్య ఉంది కేవలం స్నేహమే అని వారు చెప్తున్నప్పటికి ఫ్యాన్స్ మాత్రం వారిద్దరి మధ్య ఉంది ప్రేమే అని నమ్ముతున్నారు. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే రష్మిక, విజయ్ ఇద్దరు కలిసి మరో సినిమా లో నటించబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. అ సినిమా స్క్రిప్ట్ కూడా రెడీ గా ఉందట. వారిద్దరి కాంబినేషన్ లో ఎన్ని సినిమా లు వచ్చిన కూడా అవి విజయం సాధిస్తాయి అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.