సైమా అవార్డ్స్ లో హైలైట్ అయిన ఆ సినిమా.. ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..

ప్రస్తుతం సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుకకు రంగం సిద్ధం అవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15,16 తేదీల్లో సైమా అవార్డ్స్  ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించాలని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ అవార్డ్స్ ఫంక్షన్ ని దుబాయ్ లోని డీ.డబ్ల్యూ.టీ.సి లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. నామినేషన్స్ కి సంబందించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. తెలుగు నుండి ఉత్తమ చిత్ర కేటగిరీలో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ ఆర్ ఆర్’ , సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు ‘, నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’, అడివి శేష్ నటించిన ‘మేజర్’, సీతారామం ‘ సినిమాలు పోటీ పడుతున్నాయి.


తెలుగు నుండి అత్యధిక కేటగిరీల్లో నామినేట్ అయిన సినిమా గా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఏకంగా 11 కేటగిరీలో నామినేషన్స్ దక్కించుకుంది. అ తరువాత సెకండ్ ప్లేస్ లో ఉన్న సీతారామం సినిమా 10 కేటగిరీలో నామినేట్ అయింది. తెలుగు తరువాత తమిళం లో అత్యధికంగా నామినెటే అయిన సినిమాగా పొన్నియన్ సెల్వన్ 1 ఉంది. దాదాపు 10 నామినేషన్స్ ఈ సినిమా కి దక్కాయి. ఆ తరువాత స్థానంలో ‘విక్రమ్ ‘ సినిమా 9 కేటగిరీల్లో నామినేషన్స్ ని దక్కించుకుంది.

ఈసారి సైమా అవార్డ్స్ కోసం అన్ని బాషల నుండి పోటి గట్టిగానే ఉంది. ప్రతీ భాషలో భారీ సినిమాలతో పాటుగా, ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా లు ఉన్నాయి. దాంట్లో కన్నడ ఇండస్ట్రీ నుండి చాలా చిన్న సినిమా గా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన ‘కాంతార ‘, ‘కేజీఫ్ 2 ‘ సినిమా లు ఏకంగా 11 కేటగిరీలో నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఇంకోవైపు మలయాళం నుండి సైమా కోసం గట్టి పోటీ జరుగుతుంది. దీనిబట్టి చూస్తే ఈసారి సైమా అవార్డ్స్ కోసం నాలుగు బాషలనుండి సినిమాలు సందడి చేయబోతున్నాయి.