4వ రోజు దారుణంగా ప‌డిపోయిన `బ్రో` క‌లెక్ష‌న్స్‌.. రూ. 100 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టించిన `బ్రో` గ‌త శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ సూప‌ర్ హిట్ వినోయ‌ద సిత్తంకు రీమేక్ గా సుమ‌ద్ర‌ఖ‌ని తెర‌కెక్కించిన ఈ చిత్రం అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినాకూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ్యానియాతో వీకెండ్ వ‌రకు బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపింది.

కానీ, వ‌ర్కింగ్ డేస్ లోకి ఎంట‌ర్ అయ్యాక బాగా వీక్ అయిపోయింది. 4న రోజు బ్రో క‌లెక్ష‌న్స్ దారుణంగా ప‌డిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో మొద‌టి రోజు రూ. 23 కోట్లు.. రెండు, మూడు రోజుల్లో రూ. 10 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్న బ్రో మూవీ 4వ రోజు రూ. 2.36 కోట్ల‌తో స‌రిపెట్టుకుంది.

అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా నాలుగు రోజుల్లో మొత్తం రూ. 58.22 కోట్ల షేర్‌, రూ. 97.05 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఈ సినిమా రూ. 98.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. ఈ టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే.. ఇంకా రూ. 40.28 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. మ‌రి ఈ కొండంత‌ టార్గెట్ ను మామాఅల్లుళ్లు రీచ్ అవుతారా.. లేదా.. అన్న‌ది చూడాలి. కాగా, ఏరియాల వారీగా బ్రో మూవీ 4 డేస్ టోట‌ల్‌ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి…

నైజాం: 18.44 కోట్లు
సీడెడ్: 5.96 కోట్లు
ఉత్త‌రాంద్ర‌: 6.07 కోట్లు
తూర్పు: 4.08 కోట్లు
పశ్చిమ: 3.84 కోట్లు
గుంటూరు: 4.13 కోట్లు
కృష్ణ: 2.93 కోట్లు
నెల్లూరు: 1.47 కోట్లు
—————————————–
ఏపీ+తెలంగాణ‌= 46.92 కోట్లు(73.55 కోట్లు~ గ్రాస్)
—————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 5.15 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 6.15 కోట్లు
———————————————-
టోటల్ వరల్డ్ వైడ్= 58.22 కోట్లు(97.05 కోట్లు~ గ్రాస్)
———————————————-