తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అగ్రహీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేకున్నా.. బాక్సాఫీస్ వద్ద నువ్వా-నేనా అంటూ ఈ ఇద్దరు హీరోలు అనేక సార్లు పోటీ పడ్డాడు. ఇప్పటికీ పడుతూనే ఉన్నాడు. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య నందమూరి వర్సెస్ మెగా అన్నట్లు వార్స్ నడుస్తుంటాయి.
అయితే కొన్నాళ్ల నుంచి చిరంజీవి, బాలయ్య అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నా.. ఒక్కప్పుడు మాత్రం చాలా సన్నిహిత్యంగా ఉండేవారు. గతంలో వీరిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీకి కూడా సైన్ చేశారు. కానీ, అనూహ్యంగా ఈ మూవీ నుంచి చిరంజీవి తప్పుకున్నాడు. ఇంతకీ చిరంజీవి-బాలకృష్ణ కాంబోలో మిస్ అయినా ఆ సినిమా మరేదో కాదు `అపూర్వ సహోదరులు`.
కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. విజయశాంతి, భానుప్రియ ఇందులో హీరోయిన్లు. 1986 అక్టోబరు 9న విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే నిజానికి అపూర్వ సహోదరులు మూవీని మొదట ఓ మల్టీస్టారర్ గా అనౌన్స్ చేశారు. ఇందులో చిరంజీవి, బాలకృష్ణ హీరోలుగా ఎంపిక అయ్యాడు. కొంత షూటింగ్ కూడా పూర్తైంది. కానీ, ఏమైందో ఏమో కానీ చిరంజీవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దాంతో చిరంజీవి క్యారెక్టర్ కూడా బాలకృష్ణనే చేసి.. సూపర్ హిట్ ను అందుకున్నాడు.