నయనతార 11, దీపిక 20కోట్లు .. గెస్ట్ పాత్రలతోనే దిమ్మ తిరిగే పారితోషికం పుచ్చుకుంటున్నారుగా..

పాన్ ఇండియా సినిమా ‘పఠాన్’ సక్సెస్ తో  బాలీవుడ్ లో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు షారుఖ్ ఖాన్. ఈ సినిమా విజయం తరువాత షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమా ‘జవాన్ ‘. ఈ సినిమా సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రాభోతుంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఏంటర్టైన్ సినిమా లో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, దీపికా పదుకునే గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు. అలానే ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నట్టిస్తున్నాడు.

అయితే ఈ సినిమా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో షారుఖ్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందే నాలుగు వందల కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిసినెస్ చేసినట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ సినిమా కి సంబందించిన రెమ్యూనరేషన్స్ హిందీ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారాయి. జవాన్ సినిమా లో నటించే నటినటులు ఎంతేంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నయనతార కంటే గెస్ట్ రోల్ లో నటించిన దీపికా నే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.

జవాన్ సినిమా కి నయనతార 11 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా, దీపికా పదుకోనే 17 నుండి 20 కోట్లు వరకూ పారితోషకం తీసుకుంటుంది అని సమాచారం. అలానే విలన్ పాత్రలో నటిస్తున్న విజయ్ సేతుపతి 21 రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న విలన్ గా విజయ్ సేతుపతి రికార్డు క్రియేట్ చేసారు. ఇక ఈ సినిమా తో నయనతార , అట్లీ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఆగెస్ట్ లో జైలర్ సినిమా ట్రైలర్ రిలీజ్ కాభోతుంది.