ఫైనల్లీ ఆ లిస్ట్ లోకి చరణ్ కూడా చేరిపోయాడా..? ఫ్యామిలీ ఫ్యామిలీ అంతేనా బాసూ..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఒకటే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.. అదే కన్నడ బ్యూటీ శ్రీలీల . కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని.. ఆ తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణ లో పెళ్లి సందడ్ లో నటించిన శ్రీ లీల సెకండ్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్గా మారడమే కాకుండా ..100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది .

ప్రజెంట్ టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాలల్లోను భాగమైన శ్రీ లీల ..రామ్ చరణ్తో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా శ్రీ లీల జతకట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి . ప్రెసెంట్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్ త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూట్లో పాల్గొనబోతున్నారు .

కాగా ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా శ్రీలీల సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . రెండో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని అనుకోగా.. ఆ పాత్ర రష్మిక మందన ప్లే చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో శ్రీ లీల హిట్ లిస్టులో చరణ్ కూడా చేరిపోయాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హిట్ హీరోయిన్లని ఇలా టాక్ లో పెట్టుకోవడం మీ ఫ్యామిలీ కి అలావాటేగా..అంటున్నారు జనాలు..!!