ఆ విషయంలో టాలీవుడ్ నటులందరూ బాలయ్యకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే…

నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను అల్లరించే బాలయ్య కు ఇండస్ట్రీ మొత్తం హ్యాస్టాప్ చెప్పాల్సిందే అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల నుండి మొదలుపెట్టి యంగ్ హీరోల వరకు అందరూ రెమ్యూనరేషన్ విషయంలో ముక్కుపిండి వసూలు చేస్తుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, బాలయ్య లాంటి చాలామంది స్టార్ హీరోల సినిమాలు వంద కోట్ల రేంజ్ లో థియేటర్ మార్కెట్ చేస్తున్నారు.

ఆంధ్ర – సీడెడ్ – నైజాం – ఓవర్సిస్ అన్ని కలిపి 100 కోట్లకు పైగా వస్తుంది. అయితే మార్కెట్లో రవితేజ కి ఉన్న డిమాండ్ 60 కోట్లు అయితే, వెంకటేష్ కి 20 కోట్ల వరకూ ఉంటుంది. కానీ వారు తీసుకునే రెమ్యూనేషన్ మాత్రం నాగార్జున, వెంకటేష్ లు రూ. 10 కోట్లకు అటు ఇటుగా తీసుకుంటారు. అయితే వెంకటేష్ సినిమా లు కనీసం బ్రేక్ ఈవెన్ అయినా అవుతుంటాయి కానీ నాగార్జున సినిమాలు ఎంత డిసాస్టర్లు అవుతున్నాయో చెప్పనవసరం లేదు. అయిన కూడా నాగార్జున 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ని ముక్కు పిండి వసూలు చేస్తున్నాడట. ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాకు 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట, అంతేకాకుండా లాభాల్లో 25 శాతం వాటా కూడా ఉందని తెలుస్తుంది.

చిరంజీవి నటించిన వాల్తెరు వీరయ్య సినిమా కి  55 కోట్ల రెవెన్యూ రేషన్ తీసుకుంటే,రీసెంట్ గా నటించిన భోళాశంకర్ సినిమాకి 65 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇలా ఎవరికి నచ్చిన రెమ్యూనేషన్ వారు తీసుకుంటుంటే బాలయ్య మాత్రం మార్కెట్ రేంజ్ ని బట్టి పారితోషకం తీసుకుంటున్నారు. ఇప్పటివరకు బాలకృష్ణ తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనరేషన్ 18 కోట్లు మాత్రమే. ఇకపై నటించే సినిమా లకి 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే మెగా బ్రదర్స్ సినిమాలతో సమానంగా బాలయ్య సినిమాలకు కూడా థియేటర్ మార్కెట్ ఉంటుంది. అందుకే బాలకృష్ణ నటించిన సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా నిర్మాతలు హ్యాపీగానే ఉంటారు. కాబట్టి టాలీవుడ్ లో ఉన్న హీరోలు, నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండ బాలయ్యల రీజన్బుల్గా రెమ్యూనరేషన్ తీసుకుంటే బాగుంటుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.