బాహుబలి సినిమా సత్యరాజ్ ఇంట విషాదం..!!

కోలీవుడ్లో మంచి యాక్టర్ గా పేరు పొందిన సత్యరాజ్ కొన్ని సినిమాలలో హీరోగా కూడా నటించారు. పలు చిత్రాలలో కీలకమైన పాత్రలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన సత్యరాజ్.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం బాహుబలి సినిమాల కట్టప్ప గా ప్రతి ఒక్కరికి సుపరిచితమయ్యారు.. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటించిన సత్యరాజ్ ఇంట తాజాగా విషాదఛాయలు నెలకొన్నట్టు తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.

సత్యరాజ్ తల్లి నతం బాల్ గడిచిన కొన్ని గంటల క్రితం మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆమె వయసు 94 సంవత్సరాలుగా ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కొన్ని గంటల క్రితం కోయంబత్తూరు లోని తన స్వగ్రామంలో కన్నుమూసినట్టు గా కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా నటుడు సత్యరాజ్ ఇంట విషాదఛాయలు నెలకొన్నాయి. నతం బాల్ కు ముగ్గురు పిల్లలు ఒక అబ్బాయి..ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి.. ఒకరు సత్యరాజ్ కాగా కుమార్తెలు కల్పన, రూప.. ఇక సత్యరాజుకు తల్లి అంటే చాలా ఇష్టం అందుకే తను నటించిన సినిమాలు తన తల్లి చూడడం ఇష్టమని చాలాసార్లు తెలియజేశారు సత్యరాజ్.

Veteran actor Sathyaraj's mother passed away at the age of 94 - Tamil News - IndiaGlitz.com

సత్యరాజ్ మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సైతం సంతాపం తెలుపుతున్నారు. కోలీవుడ్ నటుడు ఎమ్మెల్యే ఉదయినిది స్టాలిన్ కూడా తన ట్విట్టర్ వేదికగా సంతాపం తెలియజేయడం జరిగింది. సత్యరాజ్ కుమారుడు కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల కోలీవుడ్ నుంచి తెలుగులోకి కొన్ని డబ్బింగ్ చిత్రాలను విడుదల చేసి పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్లో వైరల్ గా మారుతోంది.