స‌మంత కంటే విజ‌య్ దేవ‌ర‌కొండే చిన్నోడా.. వీరిద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

మ‌హాన‌టి మూవీలో తెర‌పై కాసేపు జంట‌గా క‌నిపించిన టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేర‌కొండ‌, సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత‌.. ఇప్పుడు `ఖుషి` మూవీలో మ‌ళ్లీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ను మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు.

ఇందులో ముర‌ళీ శ‌ర్మ‌, వెన్నెల కిషోర్‌, జ‌య‌రామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెప్టెంబ‌ర్ 1న ఈ సినిమా తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్, మ‌ల‌యాళం మ‌రియు హిందీ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ ద్వారా సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌చారకార్య‌క్ర‌మాల‌తో మేక‌ర్స్ మ‌రింత హైప్ పెంచుతున్నారు.

ఇదే త‌రుణంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత మ‌ధ్య ఉన్న ఏజ్ గ్యాప్ నెట్టింట వైర‌ల్ గా మారింది. సాధారంగా హీరోలే త‌మ‌కంటే చిన్న వ‌య‌సు ఉన్న హీరోయిన్ల‌తో సినిమాలు చేస్తుంటారు. కూతురు వ‌య‌సున్న హీరోల‌తో జ‌త‌క‌ట్టిన హీరోలు ఎంద‌రో ఉన్నారు. అయితే ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. స‌మంత కంటే విజ‌య్ దేవ‌ర‌కొండే చిన్నోడు. విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌య‌సు 34 కాగా.. స‌మంత‌కు 36 ఏళ్లు. వీరిద్ద‌రి మ‌ధ్య రెండేళ్లు ఏజ్ గ్యాప్ ఉంది. ఈ విష‌యం తెలిసి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే గ‌తంలో కూడా స‌మంత త‌న‌కంటే చిన్న వ‌య‌సు హీరోల‌తో జ‌త‌క‌ట్టింది.