కీర్తి సురేష్ బ్యూటి సీక్రెట్ ఇదే… వామ్మో ఇంతలా మెయింటైన్ చేస్తుందా…!

కేరళ కుట్టి కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లోనూ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా దసరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కీర్తి ఇటీవల చిరంజీవి సినిమాలో భోళాశంకర్‌లో కలిసి నటించిన మంచి మార్కులు కొట్టేసింది. కానీ సినిమా ఊహించిన రేంజ్ లో అయితే సక్సెస్ కాలేదు.

కళ్ళు చెదిరే అందంతో క్యూట్ లుక్స్‌తో మతి పోగొట్టే కీర్తి అందం వెనుక ఉన్న రహస్యం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఎటువంటి వ్యక్తికైనా మానసిక, శారీరక ఉల్లాసం కోసం ప్రతిరోజు యోగా అవసరం. పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి ఎప్పుడు చిరునవ్వుతో ఉండడానికి యోగ ఎంతగానో సహాయపడుతుంది. కీర్తి కూడా తన ఆరోగ్యం కోసం రోజు యోగా చేస్తూ ఉంటుందట.

అలాగే చర్మ సౌందర్యానికి సహజమైన పద్ధతుల్ని పాటిస్తుందట‌.. నారింజ తొక్కల పొడిలో కొద్దిగా రోజ్‌ వాటర్ కలిపి స్క్రబ్ చేసుకోవడం, పచ్చి పసుపు కొమ్ము పేస్ట్ లో కొన్ని చిక్కటి పాలు కలిపి ఫేస్ మాస్క్ వేసుకోవడం ఇలాంటి బ్యూటీ టిప్స్‌ను పాటిస్తుందట. షూటింగ్ లేని టైమ్స్‌లో మేకప్ కి దూరంగా కీర్తి సురేష్ ఉంటానని కేవలం ఇటువంటి నేచురల్ స్క్రాబ్స్‌ మాత్రమే వాడుతానని చెప్పుకొచ్చింది.