నీ కొడుకు అలాంటోడే.. మాజీ భ‌ర్త గుట్టు అత్త ముందు బ‌య‌ట పెట్టిన స‌మంత‌…!

స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఖుషి సినిమా ఇటీవల ప్రమోషన్స్ జరుపుకుంటుంది. ఈ సినిమా సక్సెస్ కావాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. గతంలో వచ్చిన యశోద, శకుంతలం రెండు డిజాస్టర్లుగా నిలవడంతో సమంత క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. ఎలాగైనా ఈ సినిమాతో సమంత హిట్ కొట్టాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఆరోగ్యం బాగోక ట్రీట్మెంట్ కోసం తల్లితో కలిసి విదేశాలకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక‌ సమంత – నాగచైతన్య విడాకుల గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది.

అందులో నిజం ఎంత ఉందో తెలియకపోయినా వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా వీరి విడాకులకు సంబంధించి అసలు కారణం ఇదేనంటూ మరో వార్త వైరల్ అవుతుంది. ఇక విషయం ఏంటంటే సమంత అప్పుడప్పుడు విదేశాలకు వెళ్తూ ఎంజాయ్ చేసే సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా విడాకుల తర్వాత డిప్రెషన్ నుంచి బయటపడడానికి బాగా వెకేషన్ లకు వెళ్ళింది. అయితే సమంత భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఓసారి వెకేషన్ కి వెళ్ళగా అక్కడ తన మాజీ అత్త (నాగచైతన్య తల్లి) దగ్గుపాటి లక్ష్మి ని కలిసిందట. ఆమె కనిపించడంతోనే ఎమోషనల్ గా ఫీల్ అయిన సమంత ఆమె వద్దకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుందట.

చైతు, నేను పెళ్లి చేసుకున్న చాలా రోజుల వరకు బాగా సంతోషంగా ఉన్నామని.. తర్వాత మెల్లగా చైతు నన్ను కంట్రోల్ చేయాలని చూశాడని.. అలాగే ఫ్యామిలీ వాళ్ళు కూడా నేను సినిమాల్లో నటించడానికి ఒప్పుకోకపోయేసరికి నా ఫ్రీడమ్ పోతుందేమో అని భయం వేసిందని.. ఒక టైంలో అయితే అసలు సినిమాలే వద్దు అన్నట్లుగా మాట్లాడారు.. దాంతో ఫ్యామిలీ లైఫ్ లో కాంప్రమైజ్ అయితే నా సినిమా లైఫ్ పక్కన పెట్టాలి అప్పుడు ఫ్యామిలీ ఆదిపత్యం నాగచైతన్య చేతులకు వెళ్ళిపోతుంది.. నాకంటూ ఒక గుర్తింపు ఉండదు అనిపించిందని.. అందుకే నేను చైతుతో విడాకులకు రెడీ అయ్యాను నేనే చైతుని మొదటిగా విడాకులు అడిగాను అంటూ సమంత బాధపడిందట.