చుండ్రు స‌మ‌స్య‌ల‌కి బెస్ట్ చిట్కా ఇదే…!!

ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల మనం డాండ్రఫ్ నుంచి బయటపడచ్చని తెలుసా? మనల్ని వేధించే జుట్టు సమస్యలో చుండ్రు సమస్య కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరిని ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది. తలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం, పొడి చర్మం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య ఏర్పడుతుంది. తలలో చుండ్రు కారణంగా జుట్టు రాలడం, దురద వంటి సమస్యలు ఉంటాయి. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. చుండ్రు తగ్గడానికి మార్కెట్లో లభించే అనేక రకమైన షాంపూలని వాడుతూ ఉంటారు.

షాంపూలు వాడడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదని చెప్పవచ్చు. చుండ్రు సమస్యతో ఇబ్బంది పడేవారు ఇప్పుడు చెప్పే చిట్కా వాడినట్లయితే సులభంగా పోతుంది. ఇందులో వాడే ప్రతి పదార్థం కూడా సహజ సిద్ధమైనదే. చుండ్రు సమస్యను తగ్గించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి… ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లో ఒక కప్పు వేపాకులు, అర్థ చక్క నిమ్మకాయ, మూడు టేబుల్ స్పూన్లు పెరుగు తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి.

ఈ మిశ్రమాన్ని తల చర్మానికి పట్టేలా బాగా అంటించాలి. దీనిని ఒక గంటపాటు ఆరిన తర్వాత కుంకుడు గాయలతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. వేపాకు, పెరుగు, నిమ్మకాయ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చుండ్రుకు కారణమైన ఫంగస్‌ని తగ్గించి ఎటువంటి జుట్టు సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఈ చిట్కాను వాడడం వల్ల చాలా తక్కువ ఖర్చులో జుట్టు అందంగా తయారవుతుంది.