ప‌వ‌న్ – సాయిధ‌ర‌మ్ డిజాస్ట‌ర్ ‘ బ్రో ‘ క్లోజింగ్ క‌లెక్ష‌న్లు…. క‌న్నీళ్లు….!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన మూవీ బ్రో ది అవతార్. ఇటీవలే మంచి అంచనాల మధ్యన రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుంచే డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకొని బోల్తా పడింది. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, పైగా టాక్‌కూడా నెగటివ్‌గా ఉంది. ఈ సినిమా మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద నిలవడమే కష్టం అనిపించింది. కానీఎవరు ఊహించని విధంగా మొదటి మూడు రోజులు ఈ సినిమాకి ఓ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి.

సూపర్ హిట్ సినిమాకు ఏ రేంజ్‌లో అయితే కలెక్షన్స్ వసూలు అవుతాయో అదే రేంజ్ లో సినిమాకు కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత నాలుగో రోజు నుంచి భారీ డ్రాప్స్ సొంతం చేసుకున్న కూడా అదే స్థాయి ఓ క్యాజువ‌ల్‌ రన్ చివరి వరకు కొనసాగిస్తూ వెళ్ళింది బ్రో. దీంతో సినిమా క్లోజింగ్ టైం కి రూ.70 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఏరియా వైజ్‌గా ఈ సినిమాకు ఎంత వసూలు వచ్చాయో ఒకసారి చూద్దాం. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం నైజం ప్రాంతానికి రూ.22.50కోట్లు షేర్ వచ్చిందట.

ఈ సినిమా ఇక్కడ బ్రేక్ ఇవ్వన్‌ ఇవ్వాలంటే 25 కోట్ల రూపాయలు వసూలు చేయాలి కానీ అది జరగలేదు. ఫలితంగా రూ.2 కోట్ల నష్టం వచ్చింది. అలాగే సీడెడ్‌లో రూ.7కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.7 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.4.90 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ.4.40 కోట్లు, గుంటూరులో రూ.4.55 కోట్లు, కృష్ణలో రూ.3.60 కోట్లు, నెల్లూరులో రూ.1.80 కోట్లు గ్రాస్ వ‌సుళ్ళు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో రూ.7.30 కోట్లు అలాగే కర్ణాటకలో రూ.6.25కోట్లు మొత్తం మీదగా ప్రపంచ వ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్ వ‌సుళ‌ను బ్రో మూవీ సొంతం చేసుకుంది.