ఫస్ట్ వీకే హైయ్యెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన టాప్ టాలీవుడ్ మూవీస్ ఇవే..

2023వ సంవత్సరంలో టాలీవుడ్ లో రిలీజ్ అయిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి . ఇక కొన్ని సినిమాలయితే ఫస్ట్ వీక్ లోనే భారీగా కలెక్షన్లు సంపాదించి బాక్సఫీస్ వద్ద హంగామా చేసాయి. ప్రేక్షకులను అలరించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఫస్ట్ వీక్ లోనే భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ వాళ్తేరు వీరయ్య ‘ సినిమా గురించి మాట్లాడుకుందాం.

కె.ఎస్.రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో చిరంజీవి హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు.అలానే రవితేజ, క్యాత్రిన్ కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదల అయిన ఈ సినిమా మొదటి వారం లోనే రూ. 79. 86  కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించ్చింది.

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ‘వీర సింహారెడ్డి’ సినిమా లో నందమూరి బాలకృష్ణ హీరో గా నటించాడు. ఈ సినిమా లో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించగా హానీ రోస్, శృతి హాసన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా విడుదల అయిన మొదటి వారం లోనే రూ. 58. 51  కోట్లు కు పైగా కలెక్ట్ చేసింది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా ఆడియన్స్ నుండి మంచి టాక్ సంపాదించుకుంది. సముథ్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల అయిన మొదటి వారం లోనే రూ. 50. 71 కోట్లు పైగా కలెక్ట్ చేసింది.

అలానే ఓం రౌత్ దర్శకత్వం లో తెరకేక్కిన పాన్ వరల్డ్ మూవీ ‘ ఆదిపురుష్’. ఈ సినిమా లో రాముడి పాత్రలో ప్రభాస్, సీతా దేవిగా కృతి సనన్ అద్భుతంగా నటించారు. ఇక రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. భారీ బడ్జెట్ తో తెరకేక్కించిన ఈ సినిమా విడుదల అయిన మొదటి వారం లోనే 75. 27 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘జైలర్’. ఈ సినిమా లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించారు. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా విడుదల అయిన మొదటి వారం లోనే రూ.31. 23 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

ఇక సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ‘బేబీ’  సినిమా లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదల అయిన మొదటి వారం లోనే రూ. 20. 46 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

అలానే కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన ‘వీరుపక్షా ‘ సినిమా లో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మినన్ జంటగా నటించారు. ఈ సినిమా విడుదల అయిన మొదటి వారం లోనే రూ. 25.11 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.