ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఉన్నారు. వారిలో కొంతమంది నెంబర్ 1 స్టార్ హీరోస్ గా కొనసాగుతుంటే, మరి కొంతమందేమో నెంబర్ 2 ప్లేస్ లో కొనసాగుతున్నారు. పాన్ ఇండియా సినిమాల్లో నటించి నెంబర్ 1 స్టార్ హీరోల స్థానం సంపాదించుకున్న ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారు ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలా భారీగా సొమ్ము వెనకేసుకొని ఇండస్ట్రీ లోనే అత్యంత ధనవంతులు అవుతున్న స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు అక్కినేని నాగార్జున. నాగార్జున తన టాలెంట్ తో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరో లిస్టులోకి చేరిపోయాడు. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించి తన సత్తా చాటుకున్నాడు. నాగార్జున కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా , హోస్ట్గా, వ్యాపారవేత్తగా ఇలా అన్ని రంగాల్లో బాగా సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలోనే బాగా సంపాదించాడు కూడా. అయితే నాగార్జున మొత్తం ఆస్తులు విలువ రూ. 3,010 కోట్లు.
నాగార్జున తరువాత ఇండస్ట్రీ లో అత్యంత ధనవంతుడు అయిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నెంబర్ 1 హీరోగా పేరు సంపాదించుకున్నాడు చిరంజీవి. ఈయన కూడా బాగానే సంపాదించాడు. మెగాస్టార్ చిరంజీవి మొత్తం ఆస్తుల విలువ రూ. 1,650 కోట్లు ఉంటుంది. ఆ తరువాత ప్లేస్ లో చిరంజీవి కొడుకు మేగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో ఈయన గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం చరణ్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రామ్ చరణ్ ఆస్తుల విలువ రూ. 1370 కోట్లు. ఇక ఆ తరువాత స్థానం లో ప్రభాస్, మహేష్ బాబు,అల్లు అర్జున్,ఎన్టీఆర్, వెంకటేష్ ఉన్నారు.