క‌ళ్లు చెదిరే రేంజ్ లో `బ్రో` బిజినెస్.. మెగా హీరోల టార్గెట్ తెలిస్తే మైండ్‌బ్లాకే!

బ్రో.. మ‌రో రెండు రోజుల్లో ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్ విడుద‌ల కాబోతోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇందులో హీరోలుగా న‌టించారు. కోలీవుడ్ సూప‌ర్ హిట్ `వినోద‌త సిత్తం`కు రీమేక్ ఇది. సముద్ర‌ఖ‌ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించారు.

కేతిక శ‌ర్మ, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ఇందులో హీరోయిన్లుగా న‌టించారు. త్రివిక్ర‌మ్ ఈ మూవీకి మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, ట్రైల‌ర్లు మ‌రియు సాంగ్స్ సినిమాపై భారీ హైప్ ను పెంచేశారు. బిజినెస్ కూడా క‌ళ్లు చెదిరే రేంజ్ లో జ‌రుగుతోంది. తాజాగా బ్రో బిజినెస్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

మెగా హీరోల టార్గెట్ ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాక్ అయిపోతుంది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 80.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన ఈ చిత్రానికి.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 97.50 కోట్లు బిజినెస్ జ‌రిగింగి. దీంతో బ్రో సినిమా హిట్ అవ్వాలంటే బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 98.50 కోట్ల రేంజ్ లో షేర్ వ‌సూళ్ల‌ను అందుకోవాల్సి ఉంటుంది. ఇక ఏరియాల వారీగా బ్రో మూవీ బిజినెస్ లెక్క‌లు ఇలా ఉన్నాయి..

నైజాం: 30 కోట్లు
సీడెడ్: 13.20 కోట్లు
ఉత్త‌రాంద్ర‌: 9.50 కోట్లు
తూర్పు: 6.40 కోట్లు
పశ్చిమ: 5.40 కోట్లు
గుంటూరు: 7.40 కోట్లు
కృష్ణ: 5.20 కోట్లు
నెల్లూరు: 3.40 కోట్లు
——————————————
ఏపీ+తెలంగాణ‌ మొత్తం= 80.50 కోట్లు
——————————————

క‌ర్ణాట‌క + రెస్టాఫ్ ఇండియా: 5 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 12 కోట్లు
————————————————————-
టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్‌= 97.50 కోట్లు (బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ – 98.50 కోట్లు)
————————————————————-