ఈ మధ్యన సినీ ఇండస్ట్రీలో నటీనటులకు సినిమా అవకాశాలు తగ్గుతున్నాయి. కొత్త హీరోయిన్స్ వస్తే చాలు పాత హీరోయిన్స్ ని పక్కకు నెట్టేస్తూ ఉన్నారు.. దీంతో హీరోయిన్స్ కు అవకాశాలు లేక వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్లకే తెలియటం లేదు. అంతేకాకుండా అజ్ఞాతంలోకి కూడా వెళ్ళిపోతున్నారు.
గతకొన్ని రోజుల నుండి హీరోయిన్స్ మెహ్రిన్ అవకాశాలు లేకపోవడంతో ఈ అమ్మడు ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే టాలీవుడ్ కు చెందిన మెహరీన్ కౌర్ ను పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, పంజాబీ, లాంటి భాషలలో నటించింది. తెలుగులో అయితే మొట్టమొదటిగా కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాలో నటించి మంచి మార్కులను కొట్టేసింది. ఆ తరువాత అగ్ర హీరోల సరసన నటించి కాస్త గుర్తింపును తెచ్చుకుంది.
తన కెరీర్ సాఫీగా సాగుతున్న టైంలో తనకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.మెహ్రిన్..తన సినిమాకు సంబంధించిన అప్డేట్స్ గురించి తనకు సంబంధించిన ఇంపార్టెంట్ విషయాల గురించి షేర్ చేస్తూ ఉంటుంది.ఈమెకు సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు కూడా రావట్లేదు అందుకోసమే తను ఇంట్లో ఒంటరిగా ఉండకుండా అలా ఫోటోషూట్లను చేస్తూ ఫ్యామిలీతో ట్రిప్పులను ఎంజాయ్ చేస్తోంది. ఈ అమ్మడు ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా ఈ అమ్మడు రీసెంట్ గా ఒక సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తోంది.అయితే మెహరీన్ కూడా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఏమి ఇవ్వటం లేదు.. తను ఖాళీగా ఉండకుండా విదేశాలు తిరుగుతోందని తెలుస్తోంది.
గతంలో ఒక ముఖ్యమంత్రి కొడుకుతో నిశ్చితార్థం జరిగి క్యాన్సిల్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ కెరియర్ అప్పటినుంచి సజావుగా సాగలేదని అభిమానులు భావిస్తున్నారు.. మరి ఈసారైనా అభిమానులను మెహ్రిన్ మెప్పిస్తుందేమో చూడాలి మరి.
View this post on Instagram