ఆసక్తి రేపేలా చేస్తున్న ప్రతినిధి-2 టీజర్.. నారా రోహిత్ సక్సెస్ అయ్యేనా..?

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు హీరో నారా రోహిత్.. కమర్షియల్ ఫార్మేట్లో వైవిద్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నారా రోహిత్ తన కెరియర్లో చెప్పుకోదగ్గ సక్సెస్ మాత్రం కాలేదు.. ఆ తర్వాత పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా వర్కౌట్ కాలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలపరంగా సైలెంట్ అయిన రోహిత్ తాజాగా తన కొత్త ప్రాజెక్టును సైతం అనౌన్స్మెంట్ చేశారు.

Actor Nara Rohit Announces Prathinidhi 2

తన కెరియర్ లో సూపర్ హిట్ అయిన చిత్రం ప్రతినిధి ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు రోహిత్..రోహిత్ బర్తడే కానుకగా ప్రతినిధి -2 చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్కుని విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. ఈ రిలీజ్ అయిన వీడియోలో అనుక్షణం ఆసక్తి కలిగించేలా ఉందని చెప్పవచ్చు మరొకసారి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామా ప్లాన్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు ఈ టీజర్ చూస్తే మనకి తెలుస్తోంది.

 

ఈ సినిమాను వచ్చే ఏడాది రిపబ్లిక్ డే జనవరి 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. ప్రతినిధి మొదటి భాగాన్ని డైరెక్టర్ ప్రశాంత్ మండవ తెరకెక్కించగా రెండో పార్టును మూర్తి దేవగుప్త దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమాతో నైనా నారా రోహిత్ కెరియర్ మలుపు తిరుగుతుందా లేకపోతే పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరం అవుతారు అనే విషయం తెలియాల్సి ఉన్నది..ఈ సినిమా మొత్తం పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండడమే కాకుండా నారా రోహిత్ కు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడంతో ఈ సినిమా సక్సెస్ కావడం కష్టమేనని పలువురు సినీ సెలబ్రిటీలు తెలుపుతున్నారు.