కోహినూరు వజ్రంలా మెరిసిపోతున్న `కేజీఎఫ్‌` బ్యూటీ.. ఇంత అందంగా ఉందేంట్రా బాబు?!

శ్రీనిధి శెట్టి.. ఈ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి 2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకున్న శ్రీ‌నిధి శెట్టి.. `కేజీఎఫ్‌` మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది. య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రం.. రెండు పార్టుల‌గా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేశారు.

తొలి సినిమాతో శ్రీ‌నిధి శెట్టి అంద‌రి మ‌న‌సులో దోచేసింది. అయితే పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టినా.. ఈ అందాల భామ‌కు ఆఫ‌ర్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కేజీఎఫ్ త‌ర్వాత శ్రీ‌నిధి నుంచి `కోబ్రా` మూవీ వ‌చ్చింది. విక్ర‌మ్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ప్ర‌స్తుతం శ్రీ‌నిధి చేతిలో సినిమాలేమి లేవు.

ఈ అందాల భామ‌కు ఆఫ‌ర్లు రావ‌డం లేదా.. లేక వ‌చ్చిన క‌థ‌లు న‌చ్చ‌క ఒప్పుకోవ‌డం లేదా.. అన్న‌ది తెలియ‌డం లేదు. ఇదంతా ప‌క్క‌న పెడితే.. శ్రీ‌నిధి శెట్టి తాజా ఫోటోషూట్ నెట్టింట పెను దుమారం రేపుతోంది. తళుకుల చీర‌లో కోహినూరు వ‌జ్రంలా మెరిసిపోతూ ద‌ర్శ‌న‌మిచ్చింది. చీర చాటు నుంచి క‌నీక‌నిపించిన నాభి సొగ‌సుల‌ను చూపిస్తూ మ‌త్తెక్కించే విధంగా ఫోటోలకు పోజులిచ్చింది. ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. నెటిజ‌న్లు ఇంత అందంగా ఉందేంట్రా బాబు అంటూ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.