అమ్మ అంటే ప్రాణం..అయినా ఆ విషయంలో మహేష్ సైలెంట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బ్లాక్ బస్టర్ సినిమాలతో ఫాలోయింగ్ తో పాటు మంచి పేరుని కూడా సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. పోకిరి సినిమా మహేష్ కెరీర్ లోనే పెద్ద మలుపు. ఈ సినిమా తరువాతే పోకిరి ముందు, పోకిరి తరువాత అని చెప్పేవారు. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ఎక్స్పరిమెంట్ సినిమాలు చేయడంలో మహేష్ ఎప్పుడు ముందుంటారు.

సుకుమార్ తో చేసిన 1 నేనొక్కడినే సినిమా మహేష్ ని కొత్తగా చూపించింది. మహేష్ చేసిన సినిమా ప్లాప్ అయినా అవి టెలివిజన్ లో వేసినప్పుడు మాత్రం అదిరిపోయే ఆ సినిమాలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అతడు, ఖలేజా సినిమా వేస్తే ఇప్పటికి టీవీలకి అతుక్కుపోయి చూసేవారున్నారు. అంతే కాకుండా మహేష్ సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు. గుండె జబ్బుతో బాధపడే కొన్ని వేల మంది చిన్నారులకు ఈయన ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. సినిమాల్లోనే కాడి నిజ జీవితంలో కూడా మహేష్ బాబు సూపర్ స్టార్ అనిపించుకుంటున్నారు. మహేష్ బాబుకి తల్లి అంటే ఎంత ప్రేమో కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే మహేష్ తన తల్లి చివరి కోరిక తీర్చలేదంట.

మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గత ఏడాది సెప్టెంబర్ నెలలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. తల్లి మరణించాక మహేష్ చాలా డిప్రెషన్ కి గురయ్యారు. ఎన్నో ఇంటర్వ్యూల్లో పాల్గొన్న మహేష్ ఎప్పుడు తన తల్లి అంటే తనకెంత ఇష్టమో చెబుతుండేవారు. ఎంత బిజీగా ఉన్న తల్లితో టైం స్పెండ్ చేసేవారు. తల్లి ఇంటికి వెళ్లి ఆమె చేత కాఫీ తాగితే తనకు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేవారు. కానీ మహేష్ తన తల్లి చివరి కోరికను తీర్చలేకపోయారంట. మహేష్ తల్లికి సితార అంటే చాలా ఇష్టం. తను బ్రతికుండగానే సితార ఓణీల ఫంక్షన్ చూడాలని కోరిక ఇందిరా దేవికి ఉండేదట. మహేష్ బాబుని కూడా చాలా సార్లు అడిగారట. అయితే మహేష్ కి ఇలాంటివి ఇష్టం ఉండకపోవడంతో మహేష్ ఎప్పుడు మౌనంగానే ఉండేవారట. తల్లి చివరి కోరికను తీర్చలేకపోయానని అనంతరం తన తల్లి మరణం తర్వాత
మహేష్ ఎంతో బాధపడ్డారు.