గోవా బ్యూటీ ఇలియానా ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఇలియానా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేసింది. అయితే ఇలియానాకు ఇంత వరకు పెళ్లి కాలేదు. వివాహం కాకుండానే ఆమె గర్భం దాల్చింది. ఓ అజ్ఞాత వ్యక్తితో సహజీవనం చేయడంతో.. ఇలియానా కడుపు పడండి. ప్రస్తుతం ఆ అజ్ఞాత వ్యక్తితోనే ఇలియానా ఉంటూ.. ప్రెగ్నెన్సీని ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.
అయితే ఇంత వరకు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు అన్నది ఇలియానా రివీల్ చేయలేదు. సోషల్ మీడియా ద్వారా బాయ్ ఫ్రెండ్ తో గడిపిన మధుర క్షణాలను పంచుకుంటున్నా.. సదరు వ్యక్తి ఫేస్ ను మాత్రం దాచేస్తోంది. అలాగే బాయ్ ఫ్రెండ్ గురించి కొద్ది రోజుల క్రితం ఎంతో గొప్పగా వర్ణించింది. తనకు కష్టనష్టాల్లో తోడున్నాడని, బాధ నుండి బయటపడేలా చేశాడని, అండగా నిలిచి జీవితంలో నవ్వులు పూయించాడని ఇలియానా ప్రియుడి గురించి చెప్పుకొచ్చింది.
ఇకపోతే ఇలియానా 9వ నెలలోకి అడుగు పెట్టింది. ఈ నెల చివర్లో ఇలియానా డెలివరీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే తాజాగా తొమ్మిదో నెలలో తాను ఫేస్ చేస్తున్న ఓ సమస్య గురించి సోషల్ మీడియా ద్వారా ఇలియానా పంచుకుంది. తొమ్మిదో నెలలో నీరసం తనను తీవ్రంగా బాధిస్తుందని.. దాంతో ఏ పని చేయలేకపోతున్నానని ఇలియానా తాజాగా ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది. అది కాస్త వైరల్ గా మారడంతో.. నెటిజన్లు ఆరోగ్యం పట్ల ఆమెకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరికొందరు ఇకనైనా నీ కడుపులో బిడ్డకు తండ్రిని చూపించు అంటూ కామెంట్లు పెడుతున్నారు.