వేణుస్వామిపై నెటిజెన్ల షాకింగ్ కామెంట్స్ వైరల్

వేణుస్వామి ఏది మాట్లాడిన ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. గత కొన్ని రోజుల నుంచి వేణుస్వామి వైరల్ టాపిక్స్ పై వెంటనే స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో జ్యోతిష్కుడిగా బాగా ఫేమస్ అయ్యారు. ఆయన చెప్పిన జాతకాలు గురించి చాలా తక్కువ మందే నమ్ముతుంటారు. సినీ ఇండస్ట్రీలో ఎవరైనా విడాకులు తీసుకుంటే వెంటనే ఆయన స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా నిహారిక, చైతన్య విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంపై కూడా వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నిహారిక జాతకం ప్రకారం ముందే వీరు విడిపోతారని వేణుస్వామి తెలుసంట. అంతే కాదు నిహారికకు మరో పెళ్లి చేసినా మల్లి విడాకులు అవుతాయని వేణుస్వామి చెప్పారు. ఇప్పటికే మెగా ఫ్యామిలిలో పవన్ కళ్యాణ్, చిరంజీవి కూతురు శ్రీజకు రెండు సార్లు విడాకులు కాగా, నిహారికకు కూడా ఇలానే జరుగుతుందని వేణుస్వామి చెప్పడం అభిమానులకి కోపం తెప్పించాయి.

ఒక సందర్భంలో వేణుస్వామి స్వయంగా తాను చెప్పిన జాతకాలలో 90 శాతం కరెక్ట్ అవుతాయని 10 శాతం తప్పు అవుతాయని చెప్పారు. అయితే వేణుస్వామి ఎప్పుడు ఎందుకు నెగటివ్ విషయాలు, చెడ్డ విషయాలే చెబుతున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొన్ని రోజుల నుంచు వేణుస్వామి మాట్లాడిన మాటల్లో పాజిటివ్ కంటే నెగటివ్ విషయాలు చెప్పినవే ఎక్కువ. అయితే ఆయన చెప్పేవి జాతకాలే కాదని కొంతమంది ప్రముఖ జ్యోతిష్కులు ఆరోపిస్తున్నారు.


ఈ మధ్య కాలంలో వేణుస్వామి తెలివిగా సెలబ్రిటీల పేర్లు చెప్పకుండా రాశులు, నక్షత్రాలు చెబుతున్నారు. తాజాగా రకుల్, నయనతార గురించి వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ చేసారు. ఆ కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇవి జరిగినా, జరగనున్న కొంత మంది సెలెబ్రెటీలు మాత్రం ఆయననే నమ్ముతున్నారు. అంతే కాదు వేణుస్వామి ఫీజు కూడా భారీగా ఉంటుందని సమాచారం.