కడప-10..నెల్లూరు-10..లోకేష్ ఆశలు నెరవేరవా?

లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. అలాగే అన్నీ వర్గాల ప్రజలని కలుసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు. అలాగే వారికి అండగా ఉండే విధంగా హామీలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో లోకేష్ వైసీపీ కంచుకోటలపై గట్టిగా ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆ మధ్య కడప, ఇప్పుడు నెల్లూరు జిల్లాలపై లోకేష్ ఫోకస్ పెట్టారు.

గత ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 సీట్లు, నెల్లూరులో 10కి 10 సీట్లు వైసీపీని గెలిపించారు. కానీ వైసీపీ చేసిందేమి లేదని, ఆ రెండు జిల్లాల్లో అభివృద్ధి లేదని, అదే ఈ ఒక్కసారి తమకు 10కి 10 సీట్లు ఇవ్వాలని అభివృద్ధి చేయకపోతే కాలర్ పట్టుకుని నిలదీయాలని చెప్పి లోకేష్ చెబుతున్నారు. దీంతో లోకేష్ చెప్పిన మాటలు ప్రజలు కాస్త ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గత రెండు ఎన్నికల్లో కడప, నెల్లూరుల్లో వైసీపీనే ఆదరించారు. అంతకముందు కాంగ్రెస్‌ని ఆదరించారు.

టి‌డి‌పికి పెద్ద ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఈ ఒక్కసారి టి‌డి‌పికి ఛాన్స్ ఇవ్వాలని లోకేష్ అడుగుతున్నారు. దీంతో ఆ రెండు జిల్లాల్లో టి‌డి‌పికి కాస్త ప్లస్ అవుతుంది. అయితే లోకేష్ అడుగుతున్నట్లు 10కి 10 సీట్లు వచ్చే ప్రసక్తి లేదు. కడపలో 10 సీట్లు ఉండగా..ఇప్పుడున్న పరిస్తితుల్లో టి‌డి‌పికి 2-3 సీట్లు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. ఆ వచ్చిన చాలా గొప్పే.

ఇటు నెల్లూరులో టి‌డి‌పికి 5 సీట్లు వరకు వచ్చేలా ఉన్నాయి. అలా గెలుచుకున్న బాగా గెలుచుకున్నట్లే. కాబట్టి లోకేష్ చెబుతున్నట్లు 10కి 10 సీట్లు మాత్రం అసాధ్యమనే చెప్పాలి.