వాలంటీర్లపై లోకేష్ సంచలనం..టీడీపీ అధికారంలోకి వస్తే..!

ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్..వాలంటీర్ల టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళల డేటా టేసుకుని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని, రాష్ట్రంలో వందల మంది మహిళలు మిస్ అవ్వడానికి కారణం వాలంటీర్ల అని, అలాగే ప్రతి కుటుంబం డేటా టేసుకుని ఐప్యాక్‌కు ఇస్తున్నారని, ఈ డేటా మొత్తం హైదరాబాద్ లోని ఓ ఆఫీసులో ఉందని ఆరోపిస్తున్నారు.

ఇక అటు వైసీపీ నేతలు, వాలంటీర్లు సైతం పవన్ పై విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో టి‌డి‌పి ఈ అంశంపై న్యూట్రల్ గా స్పందిస్తుంది. కొందరు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారని, ప్రజల డేటాతో వారికేమి పని అని, ప్రతి ఇంట్లోకి వాలంటీర్లు చొరబడి..వారి వివరాలని తెలుసుకుంటున్నారని ఇది కరెక్ట్ కాదని టి‌డి‌పి వాళ్ళు అంటున్నారు. అదే సమయంలో వాలంటీర్ వ్యవస్థపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ గెలిస్తే వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేయబోదని,  ఉన్న అన్ని వ్యవస్థలు కలిసి పనిచేయాలన్నది మా పార్టీ విధానం’ అని చెప్పుకొచ్చారు.

ఇక రాజ్యాంగం ప్రకారం కింది స్థాయిలో సర్పంచుల వ్యవస్థ ఉందని,  వారితో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది కలిసి పనిచేయాలని,  వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేస్తానని పవన్‌ కల్యాణ్‌ కూడా చెప్పలేదని, వలంటీర్లకు అప్పగిస్తున్న పనులనే ప్రశ్నిస్తున్నారని, వలంటీర్లను రాజకీయంగా వాడుకోవడాన్ని తాము కూడా అంగీకరించమని, కాని వైసీపీ ఆ పని చేస్తోందని అన్నారు.

మొత్తానికి దాదాపు వాలంటీర్లు రెండు లక్షలు పైనే ఉండటంతో…ఆ వ్యవస్థని రద్దు చేసే సాహసం ఏ పార్టీ చేసేలా లేదు.