జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారడం వెనుక ఇన్ని కష్టాలా..!!

బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నాడు జబర్దస్త్ వేణు. జబర్దస్త్ లో వేణు వండర్స్ అనే టీమ్ లీడర్ గా చేస్తూ తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.అయితే బుల్లితెరకు కాస్త గుడ్ బై చెప్పి వెండితెరపైకి చిన్నచిన్న అవకాశాలను అందుకొని కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించారు.

Jabardasth - 9th July 2015 - జబర్దస్త్ - Venu wonders Performance - YouTube

టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకొని అక్కడ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ జీ తెలుగులో ప్రసారం అవుతున్న అదిరింది షో ద్వారా సెకండ్ ఎంట్రీ ఇచ్చాడు. మళ్లీ జీ తెలుగులో కూడా కాస్త గ్యాప్ తీసుకొని బలగం సినిమాతో ఇరు రాష్ట్రాల ప్రజల మెప్పును పొందాడు. ఆ సినిమా ఏ రేంజ్ లో ఆడిందో చెప్పనవసరం లేదు. వేణు అంతకుముందు కమెడియన్ గానే ప్రేక్షకులకు తెలుసు కానీ ఈ సినిమా సక్సెస్ అయ్యాక డైరెక్టర్గా మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నారు.

I have worked for over 200 movies as an actor so far, but I never received commercial success" - Venu Yeldandi, 'Balagam' Director - Exclusive | Telugu Movie News - Times of India

అందులో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఆచార్య వ్యవహారాలు కట్టుబాట్లు ఇలాంటివన్నీ అందులో చూపించారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా 100 కు పైగా అవార్డులను సొంతం చేసుకుంది ఈ చిత్రం.ఈ సినిమా ఆంధ్ర కంటే తెలంగాణ వారికి ఈ సినిమా ఎంతగానో కనెక్ట్ అయిందనేచెప్ప వచ్చు .అయితే ఈ సినిమాను తీసిన వేణుకి తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ నేను 1999లో కేవలం రూ 200 తో హైదరాబాద్ వచ్చాను ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాను. అయితే ఎన్ని కష్టాలు పడ్డా నా ఏకాగ్రతను మాత్రం నేను వదులుకోలేదు.. సినిమాలు తీయాలి అన్నదే నా లక్ష్యం నా కల ఒకానొక టైంలో నేను డిప్రెషన్ కూడా వెళ్లిపోయాను. అదే టైంలోనే నాకు సొంతంగా కథ రాయాలని డైరెక్టర్గా చేయాలని బలగం సినిమా అలా పుట్టిందే అంటూ వేణు చెప్పుకొచ్చారు.