రేణు దేశాయ్‌ని అలా మార్చేసిన కొడుకు అకీరా నందన్.. భయమేస్తుంది అంటూ..

రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ లుక్ అందరికీ షాక్ ఇస్తోంది. అయితే ఆమె లుక్ వెనుక కొడుకు అకిరా హస్తం కూడా ఉందట. పవన్ కళ్యాన్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ చాలా యాక్టివ్ పర్సన్. టీనేజ్‌లో ఉన్న అకీరా చాలా విషయాల మీద అవగాహన సాధించాడు. ముఖ్యంగా మ్యూజిక్ లో మంచి టాలెంట్ ఉంది. ఇప్పటికే ఒక షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ కంపోజ్ కూడా చేసాడు. అంతేకాకుండా సాంకేతిక విషయాల మీద కూడా అకీరాకి మంచి పట్టు ఉంది.

ప్రస్తుతం కృతిమ మేధా ప్రపంచాన్ని శాసిస్తోంది. ఏఐ టూల్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి. వాటి సామర్థ్యం వల్ల చాలామంది వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. అకిరా నందన్ కూడా ఏఐ టూల్స్ వాడటం ప్రారంభించాడు ఈ క్రమంలోనే ఒక ఏఐ ఇమేజ్ టూల్ తో తన తల్లి రేణు ఫోటోలను రూపొందించాడు.

ఆ ఫోటోలను రేణు దేశాయ్ వీడియో రూపంలో తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా అకీరా రూపొందించాడు. దీని గురించి రేణు మాట్లాడుతూ ఒక్కోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని చూస్తే భయం వేస్తుంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేణు దేశాయ్ ఫోటోలో చాలా గొప్పగా కనపడింది. అకిరా వెండి తెరపై ఎప్పుడెప్పుడు అడుగుపెడతాడా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆతృత్తగా ఎదురు చూస్తున్నారు.

అయితే అకిరా కేవలం నా కొడుకు మాత్రమే, పవన్ కళ్యాణ్ కొడుకు అంటే నాకు కోపం వస్తుంది. ఇంకోసారి అలా అనొద్దు అంటూ రేణు మండిపడుతుంది. ప్రస్తుతం రేణు తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసారు. కృష్ణవంశీ దర్శకత్వం లో రవితేజ సరసన టైగర్‌ నాగేశ్వరరావు అనే సినిమా లో రేణు దేశాయ్ కీలక పాత్ర పోషించిబోతున్నారట. ఈ సినిమా దసరా పండుగా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.