ఈ ఇద్దరు అన్నదమ్ములెవ‌రో గుర్తు ప‌ట్టారా.. టాలీవుడ్ లో య‌మా ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరోలు!

పైన ఫోటోలో ఒకరిపై మరొకరు చేతులు వేసుకొని చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు పోజ్‌ ఇచ్చిన అన్నదమ్ములు ఎవరో గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో యమా ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరోలు. అందులో అన్న ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తమ్ముడు అన్న అండతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. రీసెంట్ గానే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఈపాటికి మీకు వారిద్దరూ ఎవరో తెలిసిపోయి ఉంటుంది. అవును విజయ్ దేవరకొండ.. ఆనంద్ దేవరకొండ.

త‌మ చిన్న‌నాటి ఫోటోను గ‌తంలో ఆనంద్ దేవ‌ర‌కొండ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. అది ఇప్పుడు వైర‌ల్ గా మారింది. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం మూడు చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో `ఖుషి`ని కంప్లీట్ చేసిన విజ‌య్‌.. ఇటీవ‌ల గౌత‌మ్ తిన్న‌నూరితో ఓ సినిమా, ప‌రశురామ్ తో ఓ సినిమా చేసేందుకు క‌మిట్ అయ్యాడు. ఈ రెండు చిత్రాలు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం అయ్యాయి.

ఆనంద్ దేవ‌ర‌కొండ విష‌యానికి వ‌స్తే.. బేబీ మూవీతో తాజాగా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఇదొక ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ. వైష్ణ‌వి చైత‌న్య ఇందులో హీరోయిన్ గా న‌టించింది. జూన్ 14న విడుద‌లైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ కుమ్మేస్తోంది. చిన్న సినిమాగా వ‌చ్చిన బేబీ పెద్ద విజ‌యం సాధించ‌డం క‌న్ఫార్మ్ అయిపోయింది. మ‌రి ఈ మూవీ అనంత‌రం ఆనంద్ నెక్స్ట్ ఎవ‌రితో ఉంటుంది అన్న‌ది తెలియాల్సి ఉంది.