డైరెక్టర్ శంకర్ కూతురు ఒక్కో సినిమాకి ఎంత తక్కువ శాలరీ పొందుతుందో తెలిస్తే..

ఇండియన్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, అపరిచితుడు లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు శంకర్. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2’, రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు డైరెక్టర్ శంకర్. ఈ రెండు సినిమాలను ఒకేసారి ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని చాలా కష్ట పడుతున్నాడు దర్శకుడు.

కమల్‌ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. ఇక రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాకి పాన్ ఇండియా లెవెల్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ కూడా 60 శాతం వరకూ పూర్తయింది. ఇక ఈ విషయం పక్కన పెడితే శంకర్ ముద్దుల కూతురు అతిధి శంకర్ కూడా చాలా టాలెంటెడ్. అతిధికి నటనపై ఉన్న ఇష్టంతో ఎంబీబీఎస్ పూర్తి అవ్వగానే సినిమాల వైపుకు అడుగులు వేసింది. గత ఏడాది విడుదలైన ‘విరుమన్’ సినిమాలో హీరో కార్తీకి జంటగా అతిధి ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాకి జ్యోతి, సూర్య నిర్మాతలుగా వ్యవహరించారు.

ఆ తరువాత శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘మావిరన్’ సినిమాలో నటించింది. ఈ సినిమా నిన్ననే విడుదల అయింది. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా అతిధి నటనకు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అతిధి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది. అది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం శంకర్ కి అసలు ఇష్టం లేదట. కానీ ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో శంకర్ ఒక కండిషన్ మీద ఓకే చెప్పారట. అదేంటంటే తన తండ్రి పేరు ఎక్కడా వాడుకోకుండా అవకాశాలు దక్కించుకోవాలని, అలానే సంవత్సరంలోగా అవకాశాలు రాకపోతే ఇండస్ట్రీని వదిలేయాలని శంకర్ కండిషన్ పెట్టాడట.

శంకర్ పెట్టిన కండిషన్లకు ఓకే చెప్పి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతిధికి ప్రస్తుతం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె రెండు మూడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. అయితే అతిధి తీసుకునే రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువేనట. ఆమె ఒక్కో సినిమాకు కేవలం రూ.20 నుంచి 25 లక్షల వరకే తీసుకుంటుందట. దాంతో స్టార్ డైరెక్టర్ కూతురు అయి ఉండి కూడా అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుందేంటంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో శంకర్ కూతురే అయినప్పటికీ కూడా ఆమెకి ఉన్న మార్కెట్ను బట్టి ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటుంది అని అంటున్నాడు. ఎలా అయితేనే శంకర్ కండిషన్స్ కి ఒప్పుకొని అతిధి ఇండస్ట్రీలో బాగానే నెగ్గుకొస్తుంది.